Janasena Vs Ysrcp: వైసీపీలో కాపులను టార్గెట్ చేస్తున్నారా..!? పవన్ బ్యాచ్ అతి పెద్ద ట్విస్ట్..?

Share

Janasena Vs Ysrcp: ఏపిలో రాజకీయాలు రోజుకో కొత్త టాపిక్ తో హాట్ హాట్ గా మారుతున్నాయి. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక విషయాలు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపిలో రాజకీయాలు కులాల పునాదులపై ఉన్నాయి. వాస్తవానికి ఉత్తరాది రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మత పునాదులపై ఉన్నాయి. అందుకే బీజేపీ మతతత్వ పార్టీగా అవతరించి మతాన్ని బేస్ చేసుకుని సెంటిమెంట్ రాజేసి ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మత రాజకీయాలను బీజేపీ రగిలించాలని చూసినప్పటికీ ఫేయిల్ అయ్యింది. ఎందుకంటే ..ఇక్కడ కులమే ప్రధానం, ఆ తరువాతే ప్రాంతం, మతం. అయితే తెలంగాణలో ప్రాంతం, సెంటిమెంట్, ఇప్పుడిప్పుడే రెడ్డి, వెలమ అంటూ కుల రాజకీయాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఏపిలో కుల రాజకీయాలను బేస్ చేసుకుని ఏర్పడిన ప్రాంతీయ పార్టీల పునాదులు ఒక కులం మీదకు మరొక కులం, ఒక పార్టీపై మరొక పార్టీ రెచ్చగొట్టే రాజకీయాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే సోషల్ మీడియా, వెబ్ మీడియాలు అన్ని తయారు అయ్యాయి.

Janasena Vs Ysrcp ap political news
Janasena Vs Ysrcp ap political news

Read More: CBI: జగన్ కి సీబీఐ షాక్ తప్పదా..!? ఎల్లుండి ఏం జరగనుంది..!?

Janasena Vs Ysrcp: మొన్న అంబటి..నేడు అవంతి

ఏపిలో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడినట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 15 రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సుకన్య అనే అమ్మాయితో మాట్లాడినట్లుగా ఉన్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిజానికి వాళ్లు ఇద్దరూ నిజంగా మాట్లాడారో లేదా ఎవరైనా మిమిక్రీ చేసి పెట్టారో తెలియదు. ప్రస్తుతం ఆ విషయం అప్రస్తుతం. కాకపోతే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏమిటంటే అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గ నేత, అదే విధంగా అవంతి శ్రీనివాస్ కూడా కాపు సామాజిక వర్గ నేత. అదే విధంగా సరిగ్గా ఏడాది క్రితం ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాడే. ఆయన కూడా ఇది తరహా ఆడియోలో బుక్ అయి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఈ ముగ్గురుపై సోషల్ మీడియాలో ఓ రకమైన ట్రోలింగ్ జరిగింది. ఇది కాపు కులస్తుల మీద కావాలని జరుగుతోంది. కావాలనే ఇలా చేస్తున్నారు అని జనసేన అనుకూల సోషల్ మీడియా ఈ వాదనను తెరమీదకు తెచ్చింది. దీనిలో ఎంత వరకు వాస్తవం అనేది ఇప్పుడు మనం గమనించాలి. ఇది నిజంగా నమ్మదగిన విషయమేనా. జనసేనకు చెందిన కల్యాణ్ దిలీప్ సుంకర తన యూట్యూబ్ ఛానల్ లోనే ఈ విషయాన్ని పోస్టు చేశారు. ఈ ముగ్గురు కాపు కులస్తులు, వీరిని పార్టీ నుండి బయటకు పంపడానికో లేక  ప్రాధాన్యత తగ్గించడం కోసమో కావాలనే వైసీపీ వాళ్లు బుక్ చేశారు, వైసీపీకి కాపు కులస్తులంటే పడదు అంటూ ఆయన ఆరోపణ చేశారు. నిజానికి ఎవరూ దీన్ని అంగీకరించరు.

రాజకీయ పార్టీల గెలుపునకు బీసీ, కాపు సామాజిక వర్గ ఓట్లే కీలకం

ఎందుకంటే…కాపు సామాజిక వర్గ ఓట్లతోనే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. నిజానికి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గ ఓట్లు కీలకం అన్న సంగతి అందరికీ తెలిసిందే. బీసీలు 52 శాతం ఓట్లు ఉంటే, కాపులు 27 శాతం ఓట్లు ఉన్నాయి. కమ్మ, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కేవలం 10 శాతం మాత్రమే ఉంటారు. ఇలా ఉన్నాయి ఏపిలో రాజకీయాలు. నిజానికి అంబటి రాంబాబు ఎలా బుక్కయ్యారు అంటే ఆ నియోజకవర్గ స్థానిక రాజకీయాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో నెలకొన్న ఎమ్మెల్యేల మధ్య మంత్రి పదవికి నెలకొన్న పోటీ కారణంగా అంబటి రాంబాబును ఎవరో ఒకరు బుక్ చేసి ఉంటారు. అలానే అవంతి శ్రీనివాస్ ఆడియో విషయంలోనూ అది నిజమో కాదో తెలియదు కానీ అక్కడ కూడా మంత్రి అవంతి వర్గానికి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వర్గానికి మధ్య ఏడాది కాలంగా పడటం లేదని అందరికీ తెలిసిందే. ఏడాది క్రితం జరిగిన ఓ పుట్టిన రోజు వేడుకలో ఈ రెండు వర్గాలకు పడటం లేదంటూ సోషల్ మీడియాలో ఆడియో టేపులు వచ్చాయి. దానిలో భాగంగా ఇది కూడా ఒకటి కావచ్చు.  అంటే ఆ జిల్లాలో స్థానిక రాజకీయ పరిస్థితులు, అంతర్గత విబేధాలు, వివాదాలు కారణంగానే వాళ్లు బుక్ అవుతున్నారు. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పుకోవాలి. దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. రాజకీయాల్లో ఉన్న వారు చాలా మంది ఆ స్థితిలో రాజకీయమైనా, వ్యాపారమైనా బాగా ఆర్థికంగా స్థిరపడిన తరువాత పక్క చూపులు చూస్తారు. దొరికిపోతే దొంగలు, దొరకకపోతే దొరలు. వీళ్లందరూ దొరికారు. నిజానికి ఆ వాయిస్ లు వాళ్లవో కాదో అన్నది పక్కన పెడితే రాజకీయాల్లో ఇలాంటి వాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్లను పట్టుకోకుండా జాగ్రత్త పడాలి. వీళ్లు అనూహ్యంగా దొరికిపోయారు. నిజానికి మిమిక్రీ చేయాలంటే ఎవరివైనా చేయవచ్చు కదా. వీళ్లవే ఎందుకు చేయాలి. అంబటి రాంబాబు  గత సంవత్సరం కూడా దొరికారు కదా. ఇవన్నీ నిజమని కానీ, నిజం కాదనీ మనం చెప్పడం లేదు. ఆ జిల్లాల్లో వైసీపీలో నెలకొన్న అంతర్గత పోరు  కారణంగా మాత్రమే వాళ్లను బుక్ చేస్తున్నారు. వాళ్లు బుక్ అవుతున్నారు. అంతే తప్ప ఒక కులాన్ని టార్గెట్ చేయాలనో, ఒక కులాన్ని ఉసి గొల్పాలనో, ఒక కులాన్ని అణగదొక్కాలనో వైసీపీలో జరగడం లేదు. కానీ కాపు కుల పునాదులపైనే స్థిరపడాలని అనుకుంటున్న  జనసేన మాత్రం ఇలాంటి ప్రచారం చేస్తోంది. పవన్ కల్యాణ్ మాత్రం ఇటువంటి ప్రచారాన్ని నమ్ముకోకుడదు. ఎందుకంటే పవన్ అభిమానులు అన్ని కూలాల్లోనూ ఉన్నారు. కేవలం కాపు కులస్తులే ఆయన అభిమానులు కాదు. అలా అయితే 2009 ఎన్నికల్లో  కాపు  కులస్తులు అందరూ చిరంజీవి వైపు నిలబడి గెలిపించాలి కానీ నిలబడలేదు. కాపులు 2014 లో టీడీపీతో ఉన్నారు. తరువాత 2019 ఎన్నికల్లో వైసీపీతో ఉన్నారు. ఈ కారణంగా జనసేన ఇటువంటి సోషల్ మీడియా ప్రచారాన్ని తగ్గించుకుని డిఫరెంట్ పాలిటిక్స్ చేస్తే బాగుంటుంది. కులం పునాదుల మీద కాకుండా ఆయనకు ఉన్న చరిష్మా, ఆయనకు ఉన్న అభిమాన గణాన్ని నమ్ముకుంటే బాగుంటుంది.


Share

Related posts

కలలో కూడా ప్రభాస్ నే తలచుకునేలా ఉన్నారు ..!

GRK

బీజేపీతో కలిసే ఆలోచన లేదు అంటున్న వైసీపీ లీడర్…!!

sekhar

Murder in Kakinada : కార్పొరేటర్ దారుణ హత్య..! ఎలా చంపారో చూస్తే కన్నీళ్లు ఆగవు..!!

somaraju sharma