Janasena x Ysrcp: జగన్ ఇంటికెళ్లి కొడతారట..!? జనసేన X వైసీపీ గొడవ పీక్స్..!?

Share

Janasena x Ysrcp: ఏపి రాజకీయాల్లో గత రెండు రోజులుగా జనసేన, వైసీపీ మధ్య జరుగుతున్న వివాదం హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ సోషల్ మీడియా వరకూ మాత్రమే జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య వార్ నడుస్తూ ఉండేది. ఈ పార్టీ కురాళ్లు ఆ పార్టీని, ఆ పార్టీ కురాళ్లు ఈ పార్టీని విమర్శిస్తూ పోస్టులు పెట్టుకునే వారు. ఇప్పుడు జనసేన, వైసీపీ మధ్య వివాదం తారా స్థాయికి చేరుకుని ప్రధాన నాయకులే విమర్శలు, ప్రతి విమర్శలు, దూషణలు చేసుకునే స్థాయికి వెళ్లింది. ఓ పక్క నేరుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, మరో వైపు వైసీపీ తరుపున మంత్రులు మధ్య విమర్శలు, ప్రతి విమర్శల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సినీ నటుడు పోసాని మురళీ కృష్ణ కూడా వైసీపీకి తోటుగా మారి పవన్ పై దూషణల పర్వం ప్రారంభించారు. అయితే ఈ వివాదం సృతి మించుతోంది. సాధారణంగా తెలుగుదేశం పార్టీలో అయితే విమర్శలను ఒక స్థాయికి తీసుకువెళ్లి ఆపేస్తుంది, ఆ వివాదాన్ని పెద్దది కానివ్వదు. కానీ జనసేన అంటే ఢీ  అంటే ఢీ అనే తత్వం. ఎస్ నువ్వు కొడతావా నేను రెండు కొడత, నువ్వు తిడతావా నేను నాలుగు తిడతా అనే టైప్ జనసేనది. ఎందుకంటే జనసేనలో అభిమానుల యువరక్తం అట్లా ఉంటుంది. దీంతో ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారుతోంది. వ్యక్తిగత దూషణలతో పాటు బయట కనిపిస్తే కొట్టేసుకునే వరకూ వెళుతోంది.

Janasena x Ysrcp political war
Janasena x Ysrcp political war

Janasena x Ysrcp: పోసానికి గబ్బర్ సింగ్ బ్యాచ్ వార్నింగ్

తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో అంతాక్షరి ఆడి బాగా పాపులర్ అయిన గబ్బర్ సింగ్ బ్యాచ్ స్వతహాగా పవన్ కల్యాణ్ అభిమానులు. వాళ్లు సినీరంగంలో ఎదగడానికి పవన్ కల్యాణ్ దోహదపడటంతో వాళ్లు పవన్ కల్యాణ్ కు భక్తులుగా మారిపోయారు. ఇప్పుడు వాళ్లు పోసాని కృష్ణమురళికి వార్నింగ్ ఇచ్చారు. “పోసాని నువ్వు ఎక్కడ ఉన్నా వచ్చి కొడతాం, ఏపిలో ఎక్కడ దాక్కున్నా చివరకు సీఎం జగన్ నివాసంలో దాక్కున్నా వచ్చి కొడతాం” అంటూ వార్నింగ్ ఇచ్చారు. పోసాని కృష్ణ మురళి అంతకు ముందే పవన్ అభిమానులతో తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందనీ, తనకు ఏమైనా జరిగితే పవన్ కల్యాణ్ యే బాధ్యుడు అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు అందజేశారు. పవన్ కల్యాణ్ అబిమానుల నుండి వస్తున్న దూషణలు, సెల్ ఫోన్ ల ద్వారా వస్తున్న బెదిరింపుల మెసేజ్ లు పోలీస్ స్టేషన్ లో చూపి తనకు రక్షణ కల్పించాలని కోరారు పోసాని కృష్ణమురళి. ఇదే క్రమంలో జనసేన తరుపున పవన్ కల్యాణ్ అభిమానులు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణమురళిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు. వ్యక్తిగతంగా దూషణలకు పాల్పడి పరువు కు భంగం కల్గించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇరువర్గాలు చట్టపరంగా, న్యాయపరంగా పోలీస్ స్టేషన్ లకు ఫిర్యాదులు చేసుకుని పోరాడుతూనే మరో పక్క తిట్టుకుంటున్నారు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కొట్టుకోవడానికి సిద్ధం అవుతున్నారు.

 

మీడియా సంయమనం పాటించాలి

ఈ వివాదం ఇలా పెరుగుతూ ఉంటే సమాజంలో ఉన్న ప్రజలు గానీ, ఫోర్త్ ఎస్టేట్ మీడియా గానీ చూస్తూ ఊరుకోవడమేనా? సమాజహితం కోసం ఏమి చేయాలి?. వీటిని ఇలా చూస్తూ ఉంటే పరిష్కారం కాకపోతే పెద్ద గొడవలకు దారి తీసే ప్రమాదం ఉంది. కులాల మధ్య కుంపటి రాజేసే పరిస్థితి వస్తోంది. జనసేన, వైసీపీ కొట్టుకుంటే ఎవరికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఈ వివాదాలు సద్దుమణగాలేంటే మీడియా పాత్ర ముఖ్యం. గతంలో వంగవీటి రంగా హత్యానంతరం పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఒక చోట ఘర్షణ జరిగిన విషయం మీడియా ద్వారా వెలుగులోకి వస్తే దాన్ని చూసి మరో చోట ఘర్షణ చెలరేగేవి. కుల ఘర్షణలు, దాడులు పెద్ద ఎత్తున జరిగాయి. ఆ సమయంలో మీడియా మొత్తం సంయమనం పాటించాలని నిర్ణయానికి వచ్చే వారం రోజుల పాటు పూర్తిగా ఆ వార్తలను కవర్ చేయడం ఆపేసింది. దీంతో ఘర్షణలు తగ్గుముఖంపట్టాయి. ఇప్పుడు పెరిగిన వ్యక్తిగత దూషణలు, కొట్లాటలను ప్రధాన స్రవంతి మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఆపేస్తే ఈ గొడవ సద్దుమణుగుతుంది, సొసైటీకి పట్టిన బురద వదిలిపోతుంది. నిన్న గబ్బర్ సింగ్ బ్యాచ్ పోసానిని అలా బెదిరించారు కదా వీళ్లు వైసీపీ వాళ్లు జగన్ ఇంటి మీదకు వచ్చి పోసానిని కొడతామంటే ఊరుకుంటారా తాము తిరిగి కొడతామంటారు, ఇవి ఇలా సృతిమించుతూనే ఉంటాయి. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అవసరమైతే రాళ్లు వేసుకుంటారు, ఇది ఇక్కడతో ఆగే వ్యవహారం కాదు. ఈ తరుణంలో సామాజిక బాధ్యతగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా వీటి ప్రసారం నిలుపుదల చేస్తే గొడవలు ఆగిపోతాయి. ఎన్నికల్లో ఎవరికి బలం ఉంటే వాళ్లు తేల్చుకుంటారు అంతే కానీ చిల్లరగా వ్యక్తిగత దూషణలు చేసుకోవడం, చిల్లర చేష్టలు చేయడం, రాజకీయాల్లో హుందాతనాన్ని నిర్వీర్యం చేయడం  లాంటి చర్యలు ఎవరైనా చేయకూడదు.

Read More: Ap minister Perni Nani: సినీ వివాదంలో బిగ్ ట్విస్ట్..! మంత్రి పేర్ని నానిని కలిసిన నిర్మాతల బృందం..!!


Share

Related posts

సర్కారు వారి పాట విషయంలో అందరికీ మబ్బులు విడిపోయాయి..!

GRK

సుబ్బారెడ్డి వర్సెస్ అఖిలప్రియ వ్యవహారంలో సరి కొత్త ట్విస్ట్ !

Yandamuri

బ్రేకింగ్: నాయిని ఇక లేరు..!!

somaraju sharma