NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం పై బాంబు లాంటి వార్త పేల్చిన జేసీ..!!

Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరించే ప్రతిపాదన చేస్తుండటంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. కార్మిక సంఘాల నేతలు గత కొద్ది రోజులుగా ఆంధోళన, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కార్మికులు యాజమాన్యంకు సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. కార్మిక సంఘాల ఆందోళనలకు బీజెపీ మినహా వివిధ రాజకీయ పక్షాలతో యువజన, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు పర్యాయాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖలు కూడా రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని వైఎస్ జగన్ కోరారు. ఈ అంశంపై నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపిీలు రాజ్యసభ నుండి వాకౌట్ కూడా చేశారు. కార్మిక సంఘాల ప్రతినిధులు కేంద్రంలోని పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి సైతం వెళ్లారు.

jc  divakar reddy comments on Visakha Steel Plant issue
jc divakar reddy comments on Visakha Steel Plant issue

ఇది ఇలా ఉంటే అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జెసీ దివాకరరెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై బాంబు లాంటి వార్త పేల్చారు. సహజంగానే దివాకరరెడ్డికి ముక్కుసూటిగా మాట్లాడటం ఆలవాటు. ఆయన పాతకాలం మనిషి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు అంటూ ఉంటారు. పలు సందర్భాల్లో చంద్రబాబుతోనూ నిర్మోహమాటంగా మాట్లాడేవారు. ఇప్పుడు తాజాగా జేసి..విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని ఆయన కుండబద్దలు కొట్టేశారు. దానికి ఆయన చెప్పిన కారణం కూడా సహేతుకంగానే ఉంది. ప్రధాన మంత్రి మోడీ ఒక్క సారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆపడం ఎవరి తరం కాదని జేసీ స్పష్టం చేశారు.

గతంలో టీడీపీ హయాంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు, నిరసనలు జరుగుతుంటే జేసీ అప్పుడూ చెప్పేశారు. ప్రత్యేక హోదా వచ్చేదీ కాదు. అది జరిగేదీ కాదని స్పష్టం చేశారు. టీడీపీ నేతగా ఉండి కూడా జెసి తన మనసులోని మాటను బయట పెట్టారు. జేసీ చెప్పినట్లుగా మోడీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని వెనక్కు తీసుకున్న సందర్భాలు ఇప్పటి వరకూ లేవనే చెప్పవచ్చు. ప్రజల ఆందోళనలను అసలు పట్టించుకునే రకం కాదని స్పష్టం అవుతోంది. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దులో నెలల తరబడి ఆందోళనలు చేస్తుంటే చట్టాలను వెనక్కుతీసుకునే ప్రశక్తే లేదని కేంద్రం చెప్పేసింది. కొన్ని సవరణలకు మాత్రమే అంగీకరిస్తామని కేంద్రం చెప్పుకుంటూ వస్తోంది. ఇప్పుడు విశాఖ ఉక్కు అంశంపైనా మోడీ అదే తీరులో ఉంటారు అన్నది పరిశీలకుల మాటగా ఉంది. అయితే విశాఖ ఉద్యమం ఇంకా తీవ్రతరం అయితే కేంద్రం వెనక్కుతగ్గుతుందో లేదో వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju