అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి ని పోలీసులు గృహనిర్బందం చేశారు. ఆయనను ఇంటి నుండి బయటకు రాకుండా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. జేసీ ప్రభాకరరెడ్డిని హౌస్ అరెస్టు చేయడంతో పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు అక్కడికి చేరుకున్నారు. జేసి ప్రభాకరరెడ్డి నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడంతో ఆయన అనుచరులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

కోన ఆలయ తిరునాళ్లకు వెళ్లకుండా పోలీసులు జేసిని అడ్డుకున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డి ఒకే సారి తిరునాళ్లకు వెళుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. ముందుగానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులతో కోన ఆలయ తిరునాళ్లకు వెళ్లారు. అయితే రెండు వర్గాలు ఎదురెదురు పడితే శాంతి ఘర్షణలు తలెత్తి శాంతి భద్రతల సమస్య ఎదురవుతుందని పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా జేసిని హౌస్ అరెస్టు చేశారని తెలిసింది.
గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్ధులకు కరోనా.. భయాందోళనల్లో తల్లిదండ్రులు