ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

JC Prabhakar Reddy: జేసీ ప్రభాకరరెడ్డి కీలక ప్రకటన..రాజకీయ సన్యాసం అంటూ..!

Share

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డి కీలక ప్రకటన చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జేసీ బ్రదర్స్ రాజకీయాలకు దూరంగా ఉండేందుకు వారి వారసులను రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. అయితే జేసీ దివాకరరెడ్డి, జేసి ప్రభాకరరెడ్డిల కుమారులు అనంతపురం లోక్‌సభ, తాడిపత్రి అసెంబ్లీ స్థానాల నుండి టీడీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. ఇక అనివార్య పరిస్థితిలో జేసి ప్రభాకరరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేసి తను గెలవడంతో పాటు తన వర్గీయులను గెలిపించుకుని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని రెండవ సారి అధిష్టించారు. రాష్ట్రంలో టీడీపీ గెలుచుకున్న ఏకైక మున్సిపాలిటీగా తాడిపత్రి గుర్తింపు దక్కించుకుంది.

JC Prabhakar Reddy key comments on political journey
JC Prabhakar Reddy key comments on political journey

JC Prabhakar Reddy: చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తరువాత..

తాజాగా జేసీ ప్రభాకరరెడ్డి తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలిపారు. అయితే చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తరువాత రాజకీయాల నుండి తప్పుకుంటానని పేర్కొన్నారు. కళ్యాణదుర్గంలో నిర్వహించిన టీడీపీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడే నాయకులపై రౌడీ షీటర్ కేసులు నమోదు చేస్తే భయపడేది లేదని అన్నారు. కల్యాణదుర్గంలో చిన్నారి మృతిపై న్యాయ విచారణ జరిపించాలని ప్రకాష్ నాయుడు నిరసన తెలియజేస్తే అతనిపై రౌడీ షీట్ తెరుస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదన్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపేలా మరింత పని చేస్తామన్నారు.

విమర్శలు గట్టిగానే చేయగలం

ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలపైనా జేసి ప్రభాకరరెడ్డి స్పందిస్తూ..గతంలో ఉషశ్రీ చరణ్ ఏ పార్టీలో ఉన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. వాళ్లపై కర్ణాటక లోకాయుక్త, సుప్రీం కోర్టు లో ఉన్న కేసుల విషయం చెప్పమంటారా అని ప్రశ్నించారు. వాళ్ల కంటే గట్టిగానే తాను విమర్శలు చేయగలననీ, మొత్తం చెప్పగలననీ కానీ మహిళ కనుక అన్ని విషయాలు చెప్పడం లేదని అన్నారు జేసి. తన తండ్రి చనిపోతే మూడేళ్ల పాటు శవరాజకీయాలు చేసింది వైఎస్ జగన్మోహనరెడ్డి అని, ఇప్పుడు మంత్రి ఉష శ్రీ చరణ్ వచ్చి తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ విమర్శలు చేయడం మాని మృతి చెందిన బాలిక తండ్రి వికలాంగుడని, కావున మానవత్వంతో స్పందించి ఆ కుటుంబానికి పెన్షన్ ఇప్పించాలని విజ్ఞఫ్తి చేశారు. అది చేస్తే మంత్రి ఇంటికి వెళ్లి మరీ సన్మానం చేస్తానన్నారు జేసీ.


Share

Related posts

Karthika Deepam Highlights: కార్తీక దీపం సీరియల్ ఈ వారం హై లెట్స్ మీకోసం…!

Ram

నిశ్చితార్థం చేసుకున్న సింగర్ సునీత..!!

sekhar

BIRYANI: మూలుగు బొక్క బిర్యానీ గురించి మీకు తెలుసా …?

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar