JD Lakshmi Narayana: ఆ మాజీ జెడి ఏమిటి అలాఆయిపోయారు..? రాజకీయాల్లోకి వచ్చినతరువాత తత్వం భోదపడిందా..?

Share

JD Lakshmi Narayana: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో ఎంతో మంది అధికారులు పని చేస్తుంటారు. కానీ కొందరికి మాత్రమే గుర్తింపు లభిస్తుంది. అది కీలక నేతలకు సంబంధించిన కేసుల దర్యాప్తు చేయడం వల్ల వస్తుంటుంది. సీబీఐ జేడిగా పని చేసిన ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ..జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేయడం, జగన్ ను అరెస్టు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక ఫేమస్ పర్సనాలిటీగా మారిపోయారు. ఆయన పేరు వివి అయినా జేడి లక్ష్మీనారాయణగా పాపులర్ అయిపోయారు. అయితే ఆయన ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో గత ఎన్నికలకు ముందే స్వచ్చంద పదవీ విరమణ చేశారు. ఆనాడు ఆయన ప్రత్యేకంగా రాజకీయ పార్టీ పెడతారనీ, లేదు తెలుగుదేశం పార్టీలో కాదు బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. కానీ ఆయన జనసేన పార్టీలో చేరి విశాఖ పార్లమెంట్ స్థానం పోటీ చేశారు. త్రిముఖ పోటీ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఓట్లు సాధించినప్పటికీ పరాజయం తప్పలేదు. ఆ తరువాత పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదనో, ఆయన సూచనలు పాటించడం లేదనో ఇంకేదో కారణాలతోనో లక్ష్మీనారాయణ జనసేన పార్టీ నుండి నిష్క్రమించారు.

JD Lakshmi Narayana politics
JD Lakshmi Narayana politics

రాజకీయాల్లోకి రాకముందే లక్ష్మీనారాయణ పలు విద్యాసంస్థల్లో మోటివేషన్ క్లాస్ లు నిర్వహించడంతో ఆయనను పార్టీలకు అతీతంగా యువతలో అభిమానులు తయారు అయ్యారు. జగన్ అభిమానులు ఆయనను వ్యతిరేకించినా  కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అనేక మంది ఆయనను అభిమానించారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు తత్వంబోధపడినట్లు ఉంది. తాజాగా హైదరాబాద్ లో ఆయన సామాజిక వర్గ నాయకులు ఏర్పాటు చేసిన అంతర్గత సమావేశానికి హజరైయ్యారు. ఇటీవల కాలం వరకూ లక్ష్మీనారాయణను అభిమానించే వారిలో చాలా మందికి ఆయన ఏ కులమో తెలియదు. అనేక వర్గాల వారు అభిమానించే లక్ష్మీనారాయణ ఇటీవల కాపు సామాజికవర్గ సమావేశానికి హజరుకావడం చర్చనీయాంశమైంది. ఆయన కూడా కులం ముద్ర వేసేసుకున్నారు. ఏపిలో ఆయనను ఒక నిజాయితీగా పని చేసిన అధికారిగానే చూశారు. అటువంటి ఆయన తన సామాజికవర్గ సమావేశంలో పాల్గొనడంతో ఒక కులానికి పరిమితమైన నేతగా మిగిలిపోయారు.

ఏపి రాజకీయాల్లో కుల ప్రభావం అధికంగా పని చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రాజకీయ ఎదుగుదలలో ఈ మార్క్ అడ్వంటేజ్ అవుతుందనే ఆయన ఆ అడుగు వేసి ఉంటారని పలువురు భావిస్తుండగా, రాజకీయంగా తప్పటడుగు వేశారన్న అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనూ ఇదే విధంగా తప్పటడుగు వేశారని అంటున్నారు. ఆనాడు జనసేన నుండి కాకుండా వైసీపీ లేదా టీడీపీలలో ఏ పార్టీ నుండి పోటీ చేసినా పార్లమెంట్ కు విజయం సాధించేవారని అనుకున్నారు.

 


Share

Related posts

జగన్‌‌కు చంద్రబాబు చురకలు

somaraju sharma

పాలు తాగడం వలన కూడా బరువు తగ్గవచ్చట!!

Kumar

మాస్ ఇమేజ్ కోసం తెగ తాపత్రయ పడుతున్న నాగశౌర్య..!!

sekhar