NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Jr. NTR : ఎన్టీఆర్ వస్తే ఏం జరుగుతుంది..!? టీడీపీకి ఒరిగేదేమిటి..!? “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకం..!!

Jr. NTR : తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేనన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ప్రతిపక్షంగా ఉండటం ఆ పార్టీకి కొత్త కాకపోయినా సీఎం జగన్ లాంటి వ్యక్తికి ప్రతిపక్షంగా నిలవడం టీడీపీ తట్టుకోలేకపోతుంది. ఆ పార్టీ బలం సరిపోవడం లేదు. నాయకులు విలవిలలాడుతున్నారు. నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి నాయకత్వం  ఏ మాత్రం నిలవడం లేదు. గ్రామ స్థాయి కార్యకర్తల్లో నైరాశ్యం వీడటం లేదు. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు, లోకేష్ లు పైపైకి మాటలు చెపుతున్నప్పటికీ లోలోపల పార్టీ పట్ల దిగులు వీడటం లేదు. ఎప్పుడు ఏ నాయకుడు పార్టీ నుండి జంప్ అవుతారో ? ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీకి షాక్ ఇస్తారో ?అనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

మొన్నటికి మొన్న చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్లినప్పుడు అక్కడ కార్యకర్తల నుండి ఒ డిమాండ్ వినిపించింది. జూనియర్ ఎన్ టీ ఆర్ పార్టీకి రావాలనీ, ప్రచారం చేయాలనీ. అక్కడ చంద్రబాబు ఏ సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ తరువాత మున్సిపల్ ఎన్నికలు జరగడం, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బతినడం ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు మళ్లీ జూనియర్ ఎన్ టీ ఆర్ పార్టీలోకి రావాలి..వచ్చి పార్టీని సరిదిద్దాలి..పార్టీ తరపున ప్రచారం చేయాలి, పార్టీకి కీలకంగా పని చేయాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పార్టీ అంతర్గతంగా కూడా ఇదే చర్చ జరుగుతోంది. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏమిజరుగుతుంది ? ఓట్లు వచ్చ పడిపోయాతా ? తెలుగుదేశం పార్టీకి బీభత్సమైన గెలుపు వచ్చేస్తుందా ? ఎన్టీఆర్ లో అంత సత్తా ఉందా? అనేది చూద్దాం..

Jr. NTR political entry ?
Jr NTR political entry

1982లో సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ 89లో ఓడిపోయారు. అవి ఎన్టీఆర్ చేసుకున్న స్వీయతప్పిదాలు మాత్రమే. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కోసం తెలుగు ఓటర్ల వెతుకులాట టీడీపీకి అలా కలిసి వచ్చింది. కానీ ఆ కాలం వేరు. ఇప్పుడు సమకాలీన రాజకీయాలు చూసుకుంటే తమిళనాడులో విజయకాంత్ కానీ, తెలుగునాట చిరంజీవి గానీ, తమ్ముడు పవన్ కల్యాణ్ కానీ సినీ ఫీల్డ్ నుండి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లే. ఏ మాత్రం నిలవలేక చేతులు ఎత్తేస్తున్న వాళ్లే.

చిరంజీవి పార్టీని ప్రతిపక్షంలో ఉంచలేక, కనీసం పోరాడ లేక అధికార పక్షంతో విలీనం చేసేసి కేంద్ర మంత్రిపదవితో సరిపుచ్చుకుని మళ్లీ సినిమాల్లోకి వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్ అతిధి రాజకీయాలు చేస్తూ పార్టీకి విధి విధానాలు, సిద్ధాంతాలు ఏమీ లేకుండా టైంపాస్ రాజకీయాలను చేసుకుంటూ వస్తున్నారు. తమిళనాడులో విజయకాంత్ కూడా ఇదే పరిస్థితి. తమిళనాడు రాజకీయాలను పక్కన పెడితే తెలుగునాట జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని తీసుకుంటే లేదా టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి కీలకంగా పని చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక సారి చూద్దాం.

Jr. NTR political entry ?
Jr NTR political entry

* తెలుగుదేశం పార్టీలో నాయకత్వం సమస్య కాదు. చంద్రబాబు ప్రస్తుతానికి యాక్టివ్ గానే ఉన్నారు. ఆయన మెదడు చురుగ్గానే పని చేస్తోంది. ఆయన నిర్ణయాలు కీలకంగానే ఉన్నాయి. కాకపోతే జగన్ లాంటి వ్యక్తి ముందు నిలవడం లేదు. ఇప్పుడు నాయకుడుగా ఉన్న చంద్రబాబు కంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి చేసేది అంటూ ఏమి ఉండదు. కానీ ఎన్టీఆర్ లాంటి చరిష్మా ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరుపున పని చేస్తే క్షేత్ర స్థాయిలో కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుంది. పార్టీకి కొత్త రక్తం వస్తుంది. కొత్త ఊపు వస్తుంది.

Jr. NTR political entry ?
Jr NTR political entry

 

* ఉదాహరణకు నారా లోకేష్ సభ పెడితే ఒక వేళ పదివేల మంది జనాభా వస్తారనుకుందాం, ఆ పదివేల మందిలో ఆయిదు వేల మందిని బలవంతంగా తీసుకురావాలి. లేదా బస్సులు, వాహనాలు పెట్టి తరలించాలి. వాళ్లకు డబ్బులు ఇవ్వాలి. ఖర్చు పెట్టాలి. చంద్రబాబు సభ పెట్టినా ఒక పదివేల మంది వస్తే దానిలో మూడు వేల మందికి ఇదే విధంగా ఏర్పాట్లు చేయాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి సభ పెడితే ఒక్కళ్లను కూడా బలవంతంగా తరలించాల్సిన అవసరం ఉండదు. జనం ఎవరికి వారే స్వతహాగా లక్షల్లో వస్తారు. అంటే క్రౌడ్ పుల్లింగ్ కెపాలిటీ ఉన్న నాయకుల్లో తెలుగురాష్ట్రాల్లో పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ బాగా పనికి వస్తారు. సో..టీడీపీకి క్రౌడ్ పుల్లింగ్ బాధ్యత తప్పుతుంది. స్వతగాహా ఎన్టీఆర్ కు తాత పోలికలు రావడం, తెలుగుదేశం పార్టీ నీడ ఉండటం, సామాజిక వర్గ అంశం కూడా కలిసి రావడం, ఎన్టీఆర్ కు మాస్ ఫాలోయింగ్ ఉండటం, ఇవన్నీ జనాలను తరలించే అవసరం లేకుండా బీభత్సంగా జనం అయితే సభకు వస్తారు. అక్కడి వరకూ కన్ఫర్మ్ గా చెప్పుకోవచ్చు.

Jr. NTR : జనం అయితే వస్తారు కానీ..

* పవన్ కల్యాణ్ సభలకు లక్షలాది మంది జనం వస్తే కనీసం పదివేల మంది కూడా ఓట్లు వేయలేదు. అంటే సభలకు వచ్చిన ప్రతి ఒక్కరు ఓటు వేయాలని లేదు. అందులో పది శాతం కూడా ఓటు వేయాలనీ లేదు. కనీసం రెండు మూడు శాతం అయినా ఓట్లు వేస్తారా? లేదా అనేది అనుమానమే. సినీ గ్లామర్ జనం వచ్చేలా చేస్తుంది తప్ప నాయకత్వం మాత్రం ఓట్లు వేయనీయదు. ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చినా ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారం తెలుగుదేశం పార్టీకి క్రౌడ్ పుల్లింగ్ సభలకు కళ తీసుకురావడం, గ్లామర్ అద్దడం వరకూ చేయగలరు తప్ప ఓట్లు ఎంత వరకు గుమ్మరిస్తారు అనేది అనుమానమే. అయితే కార్యకర్తలు, నాయకులు యాక్టివ్ గా పని చేస్తారు అనేది నిస్సందేహంగా చెప్పవచ్చు. అక్కడి వరకు ఎన్టీఆర్ టీడీపీలోకి రావడం మంచి జరుగుతుంది తప్ప ఓట్లు భీభత్సంగా వస్తాయి, పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్ అనే వాడిని పూర్తిగా ప్రతిపక్షంలోకి నెట్టేయవచ్చు అని మాత్రం అనుకుంటే తెలుగుదేశం పార్టీ పగటికలలు కన్నట్లే..!!

author avatar
Srinivas Manem

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju