Jr NTR: యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్ష ఆ పార్టీ క్యాడర్ లో ఎప్పటి నుండో ఉంది. కానీ గతంలో ఎప్పుడు ఒ పర్యాయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తరువాత మళ్లీ రాజకీయాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. టీడీపీలో యూత్, నందమూరి అభిమానులు మాత్రం పార్టీ బలోపేతం కావాలంటే ఎన్టీఆర్ రావాలన్న బలమైన కోరికను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గతంలో రాజకీయాల గురించి మీడియా ఆయన వద్ద ప్రస్తావించినప్పుడు తాను రాజకీయాల్లోకి రానని అయితే చెప్పలేదు కానీ తన వయసు, అనుభవం ప్రస్తుతం రాజకీయాల్లోకి సరిపోవు అని మాత్రం చెప్పారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారనే వార్త వైరల్ అవుతోంది. అయితే అది రియల్ లైఫ్ (రాజకీయాల్లో) లో కాదు. రీల్ (సినీ) లైఫ్ లో అని తెలుస్తోంది. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఎన్టీఆర్. ఇటీవల ఏపి సినిమా టికెట్ల వివాదం గురించి ఆయన స్పందించలేదు. మొన్నీమధ్య కొడాలి నాని తనపై వ్యాఖ్యలు చేసినా ఎన్టీఆర్ స్పందించలేదు. ఈ పరిణామాలు చూస్తుంటే రాజకీయాలపై ఎన్టీఆర్ కు ప్రస్తుతం ఆసక్తిలేదని స్పష్టం అవుతోంది. అయితే రీల్ (సినీ) లైఫ్ లో రాజకీయాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
Read More: CM YS Jagan: మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్..
Jr NTR: ప్రభుత్వంతో పోరాటం చేసే పవర్ ఫుల్ రోల్ లో ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ మువీ చేయడానికి ఎన్టీఆర్ సిద్దం అవుతున్నారు. ఈ మువీలో ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇప్పుడు ఆ పాత్రకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేడ్ బయటకు వచ్చింది. అది ఏమిటంటే .. మువీ కథ ప్రకారం .. బస్తీలో చదువుకునే ఓ కుర్రవాడి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. పేద విద్యార్ధుల హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాటం సాగించే పవర్ ఫుల్ రోల్ లో ఎన్టీఆర్ దర్శనం ఇవ్వబోతున్నారుట. లంచగొండి రాజకీయ నాయకులకు ఓ విద్యార్ధి ఎదురు తిరిగి పోరాటం చేస్తే ఎలా ఉంటుంది అనే కథా అంశం గురించి దర్శకుడు కొరటాల శివ చెప్పిన వెంటనే ఎన్టీఆర్ మువీకి ఓకే చెప్పేశాడుట.
రీల్ లైఫ్ రాజకీయాల్లో
గతంలో ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మువీ ఎంత సక్సెస్ అయ్యిందో తెలిసిందే. తాజాగా మరో సారి ఈ కాంబో రిపీట్ అవుతుందన్న అంచనాలు సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. వచ్చే నెలలో ఈ మువీ మొదలు పెడతారని తెలుస్తోంది. ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ అతిధిగా రానున్నారని సినీ వర్గాల టాక్. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించనున్నారు. రీల్ లైఫ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ ఎంట్రీయే కానీ రియల్ లైఫ్ రాజకీయాల్లో ఎంట్రీ కాదని అంటున్నారు. ఒక వేళ రాజకీయాల్లోకి నిజంగా ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే అది నిజంగా బిగ్ ట్విస్ట్ అవుతుందని అంటున్నారు.