NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఏకమయ్యాయి. ఏ ఒక్క ఛాన్స్ వదలకుండా వైసిపిని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఈ కూటమి పార్టీలు. మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే… ఏపీ అందాకారంలోకి వెళ్తుందని… ఆర్థిక సమస్యలు వస్తాయనే అంశాన్ని జనాల్లోకి తీసుకు వెళ్తున్నాయి కూటమి పార్టీలు.

ఇక ఇటు జగన్మోహన్ రెడ్డి మాత్రం… తన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారు. వైసిపి వస్తే సంక్షేమ పథకాలు ఉంటాయని.. బాబు వస్తే సంక్షేమ పథకాలు పోతాయని గ్రౌండ్ స్థాయిలో ప్రచారం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే వైసిపి కీలక నేత కొడాలి నాని సంచలన అంశానికి తెర లేపారు. జూనియర్ ఎన్టీఆర్… పేరును వాడుకుంటూ జనాల్లో ప్రచారం చేస్తున్నారు కొడాలి నాని.

తెలుగుదేశం పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తే… జూనియర్ ఎన్టీఆర్ కు టిడిపి బాధ్యతలు అప్పగించే పరిస్థితి వస్తుందని… కొడాలి నాని ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తే… జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సును రెచ్చగొడుతున్నారు కొడాలి నాని. ఏపీలో జూనియర్ ఎన్టీఆర్కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల కంటే ఏపీలో జూనియర్ ఎన్టీఆర్కు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు చాలామంది జూనియర్ ఎన్టీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. బయటపడడం లేదు గాని..
చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఏపీ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇదే పాయింట్ ను బేస్ చేసుకున్న కొడాలి నాని… జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతున్నారు.

గుడివాడ నియోజకవర్గంలో JrNTR ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశాలు నిత్యం నిర్వహించుకుంటూ… తన నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని ముఖ్య ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తీసుకువస్తున్నారు కొడాలి నాని. ఎన్టీఆర్…. వైయస్సార్ నాకు రెండు కళ్ళు…అలానే జూనియర్ ఎన్టీఆర్, జగన్ మోహన్ రెడ్డి నాకు రెండు కళ్ళు…జూ.ఎన్టీఆర్ ను ఒక VIPగా గౌరవిస్తామని చెబుతున్నారు. అయితే కొడాలి నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు గుడివాడ నియోజకవర్గంలో.. హాట్ టాపిక్ గా మారాయి.

గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ కు సపోర్ట్ ఇస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని చేసిన కామెంట్స్ వారిని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలా వైసిపి ఓట్లు కాకుండా తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా చీల్చేందుకు… కొడాలి నాని ఇలా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎవరి పేరు వాడుకుంటేనే… చివరిగా ఎమ్మెల్యేగా గెలవడమే కొడాలి నాని ముఖ్య లక్ష్యం. అందుకే…. గతంలో కంటే ఈసారి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు కొడాలి నాని. మరి కొడాలి నాని వ్యవహరిస్తున్న తీరుతో ఏ మేరకు ఓట్లు రాలుతాయో చూడాలి.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N