Amaravati: ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి నియమితులైయ్యారు. ఈ మేరకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఏపీ హైకోర్టు సీజేగా బాధ్యతలు నిర్వహించిన ప్రశాంత్ కుమార్ మిశ్రా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవల కోలిజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ పేర్లను సీజేఐ నేతృత్వంలోని కోలిజియం మే 16న కేంద్రానికి సిఫార్సు చేయగా రెండు వారాల్లోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ నిన్న ఆమోద ముద్ర వేయడంతో ఇవేళ వీరు ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నేపథ్యంలో ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటి వరకూ న్యాయమూర్తిగా పని చేస్తున్న వెంకట శేషసాయిని సీజేగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ స్పెషల్ సెక్రటరీ రజిందర్ కశ్వప్ నోటిఫికేషన్ జారీ చేశారు. తాజాగా ఆయనకు చీఫ్ జస్టిస్ బాధ్యతలు అప్పగించారు.
బీజేపీలో చేరికలు ఆగిపోవడానికి కారణం అదేనంటూ సంచలన కామెంట్స్ చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి