NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

న్యాయ చరామి!! ఇది వంట బట్టించుకో జగన్

 

 

ఏడు అడుగులు వేసి మూడు ముళ్ళు కట్టి నాతిచరామి అంటూ కొత్త జీవితం ప్రారంభించే రెండు విభిన్న కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు ఆడ మగ తర్వాత ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని మలచుకుంటారో పాలకులు, న్యాయ స్థానాలు సైతం ఈ వ్యవస్థను నడిపించాలంటే అలాగే నడుచుచుకోవాలి… ఒకరిపై ఒకరికి గౌరవంతో, నమ్మకం తో ముందుకు సాగాలి. భారత రాజ్యాంగం న్యాయవ్యవస్థకు పెద్దపీట వేసింది. వ్యవస్థను నడిపించే వాటిలో న్యాయవ్యవస్థ తర్వాతే పాలకులు కార్యనిర్వాహక వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చింది. అంటే దీనర్థం రాజ్యాంగాన్ని పరిరక్షించడం దేశంలోని అందరికీ న్యాయం చేయగల వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది న్యాయ వ్యవస్థ మాత్రమే.. అందుకే న్యాయమూర్తులకు ఉన్నత గౌరవాలను ఇచ్చారు. జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గరనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వానికి మధ్య రోజుకు దాదాపు ఒక గొడవ అన్నట్లు వివాదం సాగుతోంది. పలుమార్లు కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు సంచలనం అయ్యింది. మరోపక్క జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతి అంశానికి సంబంధించి న్యాయ వివాదాలు చెలరేగుతున్నాయి ఉన్నాయి. ఇప్పటికి సుమారు అరవై ఎనిమిది సార్లు కోర్టు గడప ఎక్కిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిసారి న్యాయవ్యవస్థ తో పోరాడుతూనే ఉంది.


** న్యాయ వ్యవస్థ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోరాటం ఎంత వరకు వెళ్ళింది అంటే…. వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు సైతం ప్రతి పనికి కోర్టు కావాలని మోకాలడ్డు తోందని న్యాయమూర్తులు ప్రతిపక్షం తెదేపా అధినేత చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నారని, దీనిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంవి రమణ హస్తం కూడా ఉందని బహిరంగంగానే సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థ మీద న్యాయమూర్తులు మీద పెట్టిన రకరకాల పోస్టులు సైతం సీబీఐ విచారణకు వెళ్లే వరకూ విషయం వెళ్ళింది. ఈ కేసును సైతం సీబీఐ ఇప్పటికే నివేదిక ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. అంటే న్యాయవ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది.
** హైకోర్టు ప్రతి అంశానికి సంబంధించి రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను అమలు చేయడం వరకూ తన బాధ్యత తీసుకుంటుంది. న్యాయమూర్తులు న్యాయవ్యవస్థ వ్యక్తిగత వివాదాలకు దూరంగా ఉండాలి వ్యక్తిగత విమర్శలు కేసుల విషయంలో చేయడానికి వీలు లేదు. అయితే హైకోర్టు న్యాయమూర్తులు కొందరు ప్రభుత్వం మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందంటూ వ్యాఖ్యానించడం… దానిమీద ప్రభుత్వం సుప్రీం కోర్టు వరకు వెళ్లడం… అత్యున్నత న్యాయస్థానం మళ్లీ హైకోర్టుకు మొట్టికాయలు వెయ్యడం… పదవీ విరమణ చేస్తున్న జడ్జిలు వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ని ఖైదీ నెంబర్ అంటూ వ్యాఖ్యానించడం… ఇవన్నీ వరుసగా జరిగిన పరిణామాలు. వీటన్నింటినీ చూస్తే సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి హైకోర్టు కావాలని ప్రభుత్వం మీద బురదజల్లుతోంది అన్న భావన ఏర్పడింది.
** అప్పటికప్పుడు ఢిల్లీ పర్యటన పెట్టుకొని బిజెపి పెద్దలను కలిసిన జగన్… మొదటి నుంచి గుర్రుగా ఉన్న హైకోర్టు జడ్జి విషయాన్ని ప్రస్తావించినట్లు దాని తర్వాత బదిలీలు వారికి వచ్చాయనే ప్రచారం ఊపందుకుంది. సాధారణ బదిలీలు లోనే హైకోర్టు ప్రధాన జడ్జిల బదిలీలు జరిగాయని చెబుతున్న… జగన్ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటన తర్వాత ఉన్నట్టుండి హైకోర్టు ఏపీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరికి బదిలీ రావడం ఆయనను అత్యంత చిన్న రాష్ట్రం పంపడం పలు అనుమానాలకు తావిచ్చింది… ప్రస్తుతం ఏపీ హైకోర్టు కు ప్రధాన న్యాయమూర్తిగా ఉత్తరాదికి చెందిన అరూప్ గోస్వామిని నియమించారు.. బుధవారం ఆయన చేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి నిరాడంబరంగా హాజరైన జగన్ ఆయనకు శాలువా కప్పి ప్రత్యేక అభినందనలు తెలిపి వచ్చారు… ఇప్పటికైనా జగన్ న్యాయ వ్యవస్థ తో చెట్టాపట్టాలేసుకుని… ప్రతి అంశాన్ని వివాదం చేసుకోకుండా న్యాయ సూత్రాలకు అనుగుణంగా మలుచుకొని ముందుకు వెళితే న్యాయస్థానాలు సైతం ఆయనకు తగిన విధంగా సహాయ సహకారాలు అందుతాయి.

 

 

author avatar
Comrade CHE

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju