Justice NV Ramana: ఏపికి జస్టిస్ ఎన్వీ రమణ..! హైకోర్టు జడ్జిలతో అత్యవసర మీటింగ్..!?

Share

Justice NV Ramana: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ ఎన్వీ రమణ మరో సారి ఏపికి వస్తున్నారు. ఆయన ఆ పదవిలో కూర్చున్న తరువాత ఇప్పటి వరకూ ఒకే సారి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అయితే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా ప్రోటోకాల్ పాటించలేదన్న విమర్శలు వచ్చాయి. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం అక్కడ ఉన్న అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికారు అని సమర్ధించుకున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే .. సీజే జస్టిస్ వెంకట రమణ మరో సారి రాష్ట్రానికి వస్తున్నారు.

 

Justice NV Ramana: సీజే జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పర్యటన

ఈ నెల 24,25,26 తేదీల్లో ఆయన రాష్ట్రంలోని తన సొంత గ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో బస చేయనున్నారు. ఆయన స్వగ్రామానికి వస్తున్నప్పటికీ ఖాళీగా ఉండే మనస్థత్వం ఆయనది కాదు. ఆయన న్యాయవాద వృత్తిలోకి రాకముందు జర్నలిస్ట్ గా కొంత కాలం పని చేశారు. ఆ తరువాత న్యాయవాదిగా, పీపీగా, అడ్వోకేట్ జనరల్ గా, హైకోర్టు న్యాయమూర్తి ఇలా అంచలంచెలుగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఏదిగారు. అయితే సీజే జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఏమి చేయనున్నారు అనేది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆయన హైకోర్టు న్యాయమూర్తులతో రెండు రోజుల పాటు రివ్యూ నిర్వహించబోతున్నారన్నది సమాచారం.

హైకోర్టు న్యాయమూర్తులతో సమీక్ష

ఈ సమీక్షలో కేసుల సంగతి ప్రస్తావిస్తారా లేక ఇటీవల జరిగిన వ్యవహారాలపై మాట్లాడతారా లేక రోటీన్ రివ్యూ నిర్వహిస్తారా అన్నది తెలియరాలేదు. అయితే రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు శాసన వ్యవస్థకు మద్య కొంత గ్యాప్ నడుస్తున్న విషయం తెలిసిందే. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై సీబీఐ కేసు, అమరావతి రాజధానుల కేసు, జస్టిస్ చంద్రు సంచలన వ్యాఖ్యలు ఇలా అనేక పరిణామాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. వీటిపై ఆయన రివ్యూలో సూచనలు, సలహాలు ఇస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. జస్టిస్ ఎన్వీ రమణ సూచనల అనంతరం కొన్ని కేసుల వేగవంతం అవుతాయా లేదా రోటీన్ గా జరుగుతాయా అనేది చూడాలి.


Share

Related posts

బిగ్ బాస్ 4: హౌస్ లో తన పెళ్లి సీక్రెట్ బయటపెట్టిన లాస్య..!!

sekhar

అదండీ అసలు సంగతి ! ఏమయ్యేను ఆంధ్రప్రదేశ్ గతి ?

Yandamuri

పాకిస్తాన్ ‌కు జై కొట్టిన మహిళ

Siva Prasad