NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన  పీకే మిశ్రా..! రాజధాని కేసు పట్టాలెక్కినట్లే…?

AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్..ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నూతన సీజే మిశ్రాకు పుష్పగుశ్చం అందించారు. ఛత్తీస్‌గడ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర పదోన్నతిపై ఏపి హైకోర్టుకు సీజే గా వచ్చారు. 2009 లో డిసెంబర్ నెలలో ఛత్తీస్‌గడ్ న్యాయమూర్తిగా నియమితులైన ప్రశాంత్ కుమార్ మిశ్ర అక్కడి హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. నవ్యాంధ్ర ప్రదేశ్ కు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర మూడవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమణ స్వీకారం చేశారు.

Justice prashant kumar mishra takes oath as chief justice of AP High Court
Justice prashant kumar mishra takes oath as chief justice of AP High Court

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రస్థానం

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గడ్ లోని రాయగఢ్ లో జన్మించారు. బిలాస్పూర్ లోని గురుఘసిదాస్ వర్సిటీ నుండి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1987 సెప్టెంబర్ నాలుగున న్యాయవాది వృత్తి చేపట్టారు. రాయగఢ్ జిల్లా కోర్టుతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2005 జనవరి నెలలో ఛత్తీస్‌గడ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాది హోదా పొందారు. బార్ కౌన్సిల్ చైర్మన్ గా పని చేశారు. హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యుడుగా పని చేశారు. 2004 జూన్ 26 నుండి 2007 ఆగస్టు 31 వరకూ ఛత్తీస్‌గడ్ రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ గా సేవలు అందించారు. ఆ తరువాత అడ్వొకేట్ జనరల్ గా పదోన్నత పొందారు. 2009 డిసెంబర్ పదిన ఛత్తీస్‌గడ్ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్ర నియమితులైయ్యారు.

AP High Court: రాజధాని అమరావతి కేసు ఇక పట్టాలెక్కేనా..?

ఒక పక్క కరోనా, మరో పక్క ప్రధాన న్యాయమూర్తుల బదిలీలతో రాజధాని అమరావతి కేసు హైకోర్టులో పెండింగ్ లో పడిపోయింది. తొలుత సీజే జస్టిస్ జెకే మల్లీశ్వరి హయాంలో రాజధాని అమరావతికి సంబంధించి రోజు వారి విచారణ జరిగింది. విచారణ చివరి దశలో ఉండగా ఆయన బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ఈ ఏడాది మార్చి 6వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి రాజధానుల కేసు అత్యంత కీలకమైనది కావడంతో గత విచారణను మొత్తం పక్కన పెట్టేసి మళ్లీ విచారణ కొనసాగిస్తామని జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి పేర్కొన్నారు. ఈ నెల చివరి వారం నుండి రోజు వారి విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ తరుణంలోనే జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బాధ్యతలు చేపట్టారు. కీలకమైన అమరావాతి రాజధాని కేసులను ఈ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా పాత విచారణను పరిగణలోకి తీసుకుంటారా? లేక మళ్లీ వాదనలు మొదటి నుండి వింటారా? అనేది ఆసక్తికరంగా మారింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనమే త్వరితగతిన విచారణ పూర్తి చేసి మూడు రాజధానుల అంశంపై తుది తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju