NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kadapa district Blasting: మామిళ్లపల్లె బ్లాస్టింగ్ అసలు నిజాలు ఇవీ..! 5 గురిపై కేసు నమోదు..!!

Kadapa district Blasting: కడప జిల్లా కులసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ పరిధిలోని సున్నపురాయి క్వారీ బ్లాస్టింగ్ ఘటనలో పది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణకు  ప్రభుత్వం అయిదు శాఖల అధికారులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాధమిక విచారణలోనే క్వారీ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని తేల్చారు. ఈ క్రమంలో లీజు దారుడి జీపీఏ హోల్డర్ ‌తో సహా అయిదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Kadapa district Blasting facts
Kadapa district Blasting facts

విషయంలోకి వెళితే..తిలా పాపం తలా పిరికెడు అన్నట్లు ఈ దుర్ఘటన వెనుక నిబంధనలు పాటించని క్వారీ నిర్వహకుడితో పాటు ప్రభుత్వ ఆదేశాలను పాటించని కొందరు అధికారుల బాధ్యత కనబడుతోంది. ఈ సున్నపురాయి క్వారీ కడపకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సీ రామచంద్రయ్య సతీమణి చెన్నంశెట్టి కస్తూరిబాయి పేరుతో లీజ్ కు తీసుకున్నార. 2001 నవంబర్ 2వ తేదీ నుండి 2021 నవంబర్ 1వ తేదీ వరకూ 20 ఏళ్లు ముగ్గురాళ్ల మైనింగ్ కోసం గనుల శాఖ లీజ్ కు ఇవ్వగా లీజు దారురాలు ఈ మైనింగ్ ను మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగరిమఠం అధికార వైసీపీ నాయకుడు నాగేశ్వరరెడ్డి కి జీపిఎ ఇచ్చారు. ప్రస్తుత ఆయన ఆధ్వర్యంలో భూగర్భ మైనింగ్ జరుగుతోంది.

అయితే 2019 నవంబర్ నెలలో మైనింగ్ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించిన సందర్భంలో పలు వయిలేషన్స్ ను గుర్తించారు. షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ తరువాత 2020 ఆగస్టు 25న మరో సారి తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ లీజ్ రద్దుకు చేయాలంటూ ఉన్నతాధికారులకు మైనింగ్ ఏడి రవిప్రసాద్  సిఫార్సు చేశారు. అంతే కాకుండా ఆ ప్రాంతంలో మైనింగ్ జరగకుండా చూడాలంటూ స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. అయితే స్థానిక అధికారుల పర్యవేక్షణ లోపం, అధికారి సిఫార్సులపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో తాత్సారంతో క్వారీ నిర్వహకుడు నిబంధనలు పాటించకుండా క్వారీయింగ్ కొనసాగించడం, ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి పది మంది దుర్మరణం పాలవ్వడం సంభవించింది.

ఇక్కడ మరో విషయం గమనించాలి..విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల వరకూ చెల్లించిన ప్రభుత్వం ఇక్కడి ప్రమాద బాధితులకు కేవలం పది లక్షలు ఇవ్వడం ఏమిటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి ప్రమాద బాధితులకు పరిహరం పెంచాలని కోరుతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N