Big Breaking: కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని కర్నూలు విశ్వభారతి ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో వైద్యులు కొద్దిసేపటి క్రితం డిశార్జ్ చేశారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. తన తల్లిని ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో ఎంపి అవినాష్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. ఈ నెల 19వ తేదీ నుండి అవినాష్ రెడ్డి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తన తల్లి ఆసుపత్రిలో ఉన్నందున వల్ల విచారణకు హజరు కావడం లేదంటూ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాశారు.

అంతకు ముందు 16వ తేదీ విచారణకు రావాల్సి ఉండగా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల హజరు కాలేకపోతున్నట్లు సీబీఐ కి లేఖ రాశారు. ఆ తర్వాత 19వ తేదీ విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా, చివరి నిమిషంతో తన తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ సీబీఐకి అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు అవినాష్ రెడ్డి. అయితే సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించాలని ఆదేశించింది.
ఈ నెల 22వ తేదీ విచారణకు సైతం అవినాష్ రెడ్డి డుమ్మా కొట్టారు. మూడు పర్యాయాలు విచారణకు గైర్హజరు కావడంతో ఆయనను అరెస్టు చేస్తారంటూ వార్తలు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఇవేళ తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. ఇవేళ సాయంత్రానికి తీర్పు వెలువడనున్నది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నిన్ననే తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టినప్పటినీ వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో ఇవేళటికి వాయిదా వేసింది.