NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకు షాక్ ఇస్తూ సంచలన కామెంట్స్ చేసిన మాజీ ఎమ్మెల్యే.. టీడీపీకి రాజీనామా

కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ సభ్యత్వానికి, కైకలూరు టీడీపీ ఇన్ చార్జి పదవికి రాజీనామా చేశారు. కైకలూరులో బహిరంగ సభ ఏర్పాటు చేసి మరీ తన రాజీనామా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా టీడీపీపై సంచలన కామెంట్స్ చేశారు జయమంగళ వెంకట రమణ. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలు నచ్చి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన జయమంగళ వెంకట రమణ.. ఇచ్చిన మాటకు కట్టుబడే ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మాటలు విని మోసపోయానని అన్నారు. పార్టీలో కష్టపడినా తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ లో అంతా గ్రూపు రాజకీయాలే నడుస్తున్నాయనీ, అందుకే టీడీపీని వీడుతున్నట్లు పేర్కొన్నారు.  నియోజకవర్గ అభివృద్ధి, కొల్లేరు వాసుల జీవ ప్రమాణాల మెరుగు కోసమే పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనతో పాటు వచ్చే నేతలను వైసీపీలోకి తీసుకువెళతానని జయమంగళ వెంకట రమణ ప్రకటించారు.

Kaikaluru Ex MLA Jayamangala Venkata Ramana Quits TDP party

 

గత కొద్ది రోజులుగా జయమంగళ వెంకట రమణ టీడీపీకి రామ్ రామ్ చెప్పి వైసీపీలో చేరనున్నారంటూ వార్తలు వచ్చాయి. వైసీపీలో చేరేందుకు అంగీకారం తెలిపిన తర్వాత ఆయనకు ప్రభుత్వం గన్ మెన్ లను ఏర్పాటు చేసింది. సీఎం జగన్ ఆయనకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. టీడీపీ – జనసేన పొత్తుల్లో భాగంగా కైకలూరు నియోజకవర్గాన్ని రాబోయే ఎన్నికల్లో జనసేనకు కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జయమంగళ వెంకట రమణ పార్టీ మార్పుకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. 2009 ఎన్నికల్లో కైకలూరు నుండి టీడీపీ అభ్యర్ధిగా జయమంగళ వెంకట రమణ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించడంతో కామినేని శ్రీనివాస్ పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగానూ కామినేని బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో మరో సారి పోటీ చేసిన జయమంగళ వెంకటరమణ వైసీపీ అభ్యర్ధి దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్) చేతిలో పరాజయం పాలైయ్యారు.

తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మాణానికై…

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju