NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Karthika Deepam 2 May 23th 2024 Episode: దీపకి వార్నింగ్ ఇచ్చిన అనసూయ.. కేసు వెనక్కి తీసుకున్న కార్తీక్..!

Karthika Deepam 2 May 23th 2024 Episode: బంటు ని ఇంటికి తీసుకురావడానికి పారు ప్లాన్ వేస్తుంది. సుమిత్ర ప్రాణాలు కాపాడిన దీప ఇక్కడే ఉంది కాబట్టి నా ప్రాణాలు కాపాడిన నువ్వు కూడా ఇక్కడే ఉండాలని స్కెచ్ వేస్తుంది. వాడు ఇంట్లోకి రావడానికి వీల్లేదని శివ నారాయణ అంటాడు. అయితే దీపని కూడా పంపించండి వీడు కూడా వెళ్లిపోతాడని అంటుంది పారు. మీకు నచ్చకపోతే ఇద్దరినీ పంపించాలి లేదంటే వాడు ఇంట్లోకి రావాలని తగేసి చెబుతుంది. వీడికి అత్తయ్య మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చిందంటే దీపని ఇంట్లో నుంచి పంపించడానికి ఏదైనా ప్లాన్ చేస్తుంది ఏమో జాగ్రత్తగా ఉండాలని సుమిత్ర అనుకుంటుంది. అనసూయ ఆవేశంగా దీప అని అరుస్తూ ఇంటికి వస్తుంది. ఏమైంది అత్తయ్య అంటే నువ్వు అలా పిలవద్దని తిడుతుంది. దీపకి సపోర్ట్ దాసుమిత్రా మాట్లాడుకుంది.

Karthika Deepam 2 May 23th 2024 Episode
Karthika Deepam 2 May 23th 2024 Episode

ఈవిడ దీపకి మేనత్త కొడుక్కి సపోర్ట్ చేస్తూ వెళ్లిపోయిందని సుమిత్ర శివ నారాయణకు చెబుతుంది. నీ కొడుకు రెండో పెళ్లి గురించి తెలియగానే గుండెలు బాదుకుంటూ ఆకాశానికి ఎగిరావు కదా ఏమైంది నీ ఆవేశం. ఎక్కడ చచ్చింది నీ మాటల్లోని పౌరుషం. కొడుక్కి బుద్ధి చెప్పాలనుకున్న నీ బుద్ధి ఏమైపోయింది. నీ కోడలు నీకు అవసరం లేదు నీ మనవరాలి గురించి అయినా ఆలోచించాలి కదా. పసధాన్ని మోసం చేసి కూడా జాలి కలగలేదంటే ఎంత స్వార్ధంగా బతుకుతున్నావో అర్థం అయిందని సుమిత్ర తిడుతుంది. అవును స్వార్థం తోనే బతుకుతున్న నువ్వేంటి నన్ను బెదిరిస్తున్నావని ఎదురు తిరుగుతుంది. కావాలనే వాడిని రెచ్చగొట్టే పనులు చేసి వాడి బతుకు నాశనం చేస్తున్నారని దీప తిడుతుంది. ముందు పోలీస్ స్టేషన్ కి పద అని అనసూయ అంటుంది.

ఏం తెలియక అందరూ షాక్ అవుతారు. నీ మొగుడు నీకు అన్యాయం చేశాడని కేసు పెట్టావు కదా అని అనసూయ అనేసరికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. రాత్రి పోలీసులు వచ్చి నీ మొగుడిని తన్నుకుంటూ తీసుకువెళ్లారు. నువ్వు పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటేనే వాడిని వదిలిపెడతారని అంటుంది. తాను కేసు పెట్టలేదని దీప చెబుతుంది. నువ్వు పెట్టకపోతే నీ పేరు చెప్పి వాడిని పోలీసులు ఎందుకు తీసుకెళ్తారని అనసూయ తిడుతుంది. తనకు ఏం తెలియదనే దీపం అంటుంది. నీకు తెలియకుండా నీ తరుపున కేసు ఎవరు పెట్టారని నిలదీస్తుంది. దీప సుమిత్రాన్ని కేసు ఎందుకు పెట్టారని అడుగుతుంది. తాను పెట్టలేదని సుమిత్ర సైతం చెబుతుంది. నీకు తెలియకుండా కేసు ఎవరు పెట్టారని శివ నారాయణ అంటే తనకు ఏమీ అర్థం కావడం లేదని దీప ఆలోచిస్తుంది.

Karthika Deepam 2 May 23th 2024 Episode
Karthika Deepam 2 May 23th 2024 Episode

దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది కావాల్సిన వాళ్ళు పెట్టి ఉంటారని పారు చెబుతుంది. కార్తీక్ కేసు పెట్టాడని పారు అంటుంది. గ్రానీ చెప్పింది నిజమే అయి ఉంటుంది కావాలంటే బావకి కాల్ చేసి అడగమని జ్యోత్స్న కూడా చెబుతుంది. సీఐ దీప బాధ్యత బావకు అప్పగించాడు. ఈ విషయంలో కూడా బాధ్యత తీసుకుని ఉంటాడని సీరియస్ అవుతుంది. అలా వారి మధ్య కొంత సంఘటన జరుగుతుంది. అనంతరం దసరాల వెంటనే కార్తీక్ కి కాల్ చేసి అడుగుతాడు. ఇక కార్తీక్ సైతం నేనే పెట్టానని ఒప్పుకుంటాడు. దీంతో అనసూయ వెళ్ళిపోగానే పారు దీప మీద మాటలు దాడి చేయడం మొదలు పెడుతుంది. దీప కార్తీక్ ఇంటికి వస్తుంది. నా భర్త మీద పోలీస్ కేసు పెట్టింది మీరేనా అని నిలదీస్తుంది. నేనే పెట్టానని అంటాడు. ఎందుకు పెట్టారు ఎవరిని అడిగి కేసు పెట్టారని నిలదీస్తుంది.

Karthika Deepam 2 May 23th 2024 Episode
Karthika Deepam 2 May 23th 2024 Episode

వాడు నడి రోడ్డు మీద దీపని కొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలని అంటాడు కార్తీక్. ఇలాగే వదిలేస్తే వాడు చంపేస్తాడని అంటే మాటలు పాడడం కంటే చచ్చిపోవడం నయమని అంటుంది దీప. మా అత్త ఇంటికి వచ్చి గొడవ చేసి గంటలో బయటకు రాకపోతే అందరి పరువు తీస్తానని బెదిరించింది. ఇప్పుడు కేసు వెనక్కి తీసుకోకపోతే మీ అత్తింటి వారి పరువు రోడ్డు మీద ఉంటుందని అంటుంది దీప. తనతో పాటు వచ్చి కేసు వెనక్కి తీసుకోమని దీప బ్రతిమాలుతుంది. వాళ్లు భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకోవడానికి నీకేంటి సంబంధమని కాంచన కూడా తిడుతుంది. కూతురితో సహా రోడ్డు మీదకు లాగాడకి కార్తీక్ ఆవేశంగా మాట్లాడుతాడు. మీరు ఏ సాయం చేయొద్దని భర్తని విడిపించమని దీప అంటుంది. దీంతో కార్తీక్ తన వెంట వెళ్తాడు. జ్యోత్స్న కార్తీక్ విషయంలో సుమిత్రాను నిలదీస్తుంది. బావ ఎంతగా మారిపోయాడో అర్థం చేసుకో అని చెబుతుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N