Katti Mahesh: నెల్లూరు జిల్లాలో సినీనటుడు కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కత్తి మహేష్ ఇన్నోవా కారులో చిత్తూరు నుండి హైదరాబాద్ వెళుతుండగా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కు స్వల్పగాయాలు కావడంతో నెల్లూరు మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ప్రమాదం ఏమీ లేదని తెలియజేశారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కత్తి మహేష్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.