YS Jagan: కేసీఆర్ , జ‌గ‌న్ అంటే సొంత పార్టీ నేత‌ల‌కే బీపీ పెరిగిపోతోందా?

Share

YS Jagan: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ , ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటే సొంత పార్టీ నేత‌ల‌కే బీపీ పెరిగిపోతోందా? రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ , వైఎస్ఆర్‌సీపీ పార్టీల‌కు చెందిన‌ నేత‌లే త‌మ పార్టీ ర‌థ‌సార‌థుల‌పై క‌స్సుమంటున్నారా? అంటే అవున‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదంతా తాజాగా క‌రోనా క‌ల్లోలం , త‌ద‌నంత‌ర ప‌రిణామాల గురించి.

అస‌లేం జ‌రిగింది?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతోంది. తెలంగాణలో లాక్ డౌన్ విధించ‌గా ఏపీలో క‌ఠినంగా క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు. ఇదిలాఉండ‌గా, తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు ఈ నెలలో జరగాల్సి ఉంది. అయితే, ఈ స‌మ‌యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరగాల్సిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సంబంధిత రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం తీసుకున్న తరువాత, అధికారుల నుండి మహమ్మారి పరిస్థితిని అంచనా వేసిన తరువాత కమిషన్ భవిష్యత్తులో తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఈసీ తేల్చిచెప్పింది.

ఆశ‌ల ప‌ల్ల‌కిలో… ఆగ్ర‌హావేశాల్లో…

త్వరలో తెలంగాణలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే నెల జూన్ 3న పూర్తవుతోంది. అలాగే ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మే 31తో పదవి కాలం పూర్తవుతుంది. ఖాళీ అవుతున్న స్థానాలకు ఎలక్షన్స్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అందరూ భావించారు. స‌హ‌జంగానే కొంద‌రు నేత‌లు ఆశ‌ప‌డ్డారు. అందులో ఎప్ప‌టినుంచో ప‌ద‌వులు ద‌క్క‌ని వారు లేదా ఈ ప‌దవులు త‌మ‌కే ప‌క్కా అనుకున్న‌వారున్నారు. ఇప్పుడు వారంతా త‌మ నాయ‌కుల‌పై క‌స్సుమంటున్నార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


Share

Related posts

రియా ని జైలికి వెళ్ళమని చెబుతుంది వాళ్ళేనా.. ?

GRK

Mahesh Trivikram: మహేష్- త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి హీరోయిన్ విషయంలో సరికొత్త పేరు..??

sekhar

బ్రేకింగ్ : ఇండియా లో 2,00,000 కరోనా కేసులు ?!!

siddhu