KCR : కేసీఆర్ గుడ్ న్యూస్ః యాభై వేలు కాదు… ఎన్ని ఉద్యోగాలంటే…

Share

KCR : తెలంగాణలోని నిరుద్యోగుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీపిక‌బురు చెప్పారు. తెలంగాణ‌లో కొలువుల భ‌ర్తీలో భాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను సేకరించారు. ఇందులో కీల‌క అప్‌డేట్ తెర‌మీద‌కు వ‌చ్చింది.

KCR  యాభై వేల ఉద్యోగాలు కాదు….

రాష్ట్ర ప్ర‌భుత్వం ముందుగా ప్ర‌క‌టించిన మేర‌కు లేదా ప్ర‌భుత్వం వివిధ నేత‌లు పేర్కొన్న‌ట్లుగా మొత్తం ఖాళీలు యాభై వేలు మాత్ర‌మే కాద‌ని తెలుస్తోంది. గతంలో 50 వేలుగా అంచనా వేయగా, తాజాగా పదోన్నతుల అనంతరం మరో అయిదువేల పోస్టులు తేలాయి. అన్ని శాఖల నుంచి తెప్పించిన ఖాళీల జాబితాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదివారం సీఎం కేసీఆర్‌కు సమర్పించారు. మొత్తం ఖాళీలు 55 వేల కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం. ఉపాధ్యాయ పదోన్నతులు చేపడితే ఖాళీలు మరో అయిదువేలకు పైగా పెరిగే అవకాశం ఉంది.

వీటిల్లోనే ఎక్కువ కొలువులు…

ఇప్పటి వరకు వచ్చిన గణాంకాల మేరకు పోలీసుశాఖలో అత్యధికంగా, ఆ తర్వాత విద్య, వైద్యఆరోగ్య శాఖల్లో అధిక పోస్టులున్నాయి. రెవెన్యూ, పురపాలక, వ్యవసాయ, నీటిపారుదల శాఖల్లోనూ గణనీయంగానే లెక్క తేలాయి. వచ్చే నెల మూడోవారంలో మొదటి నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇంత‌కీ నోటిఫికేష‌న్ ఎప్పుడు?

కాగా ఉద్యోగాల భ‌ర్తీ నోటిఫికేస‌న్ ఎప్పుడు విడుద‌ల అవుతుంద‌నే ఉత్కంఠ నెల‌కొంది. వాస్త‌వంగా నోటిఫికేషన్లు ఎప్పుడో రావాల్సి ఉంది కానీ ఎన్నికల నియమావళి వల్ల వాయిదా పడుతున్నాయి. గత నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. అనంతరం నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ రిలీజ్ చేసింది. ఈ ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


Share

Related posts

Andhra Pradesh: ఏపీలో గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి..!!

sekhar

MP RRR Case: కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృష్టికి ఎంపి రఘురామ కృష్ణం రాజు అరెస్టు వ్యవహారం..! ఎంపి తనయుడు భరత్ ఫిర్యాదు..!!

somaraju sharma

కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా … బీజేపీ ఏం చేస్తోందంటే

sridhar