NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR : కేసీఆర్ సార్‌… ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్స‌య్యారు?

KCR :కేసీఆర్‌… తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ ర‌థ‌సార‌థి. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో అప‌ర చాణ‌క్యుల్లో ఆయ‌న స్థానం ప్ర‌త్యేకం. అలాంటి గులాబీ ద‌ళ‌ప‌తి తాజాగా సొంత పార్టీ నేత‌ల‌పైనే గుస్సా అయ్యారు. త‌న‌ అధ్యక్షతన జ‌రిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాల సీఎం కేసీఆర్ ఒకింత ఆగ్ర‌హంగా మాట్లాడారు. సీఎం మార్పు అంటూ నేతలు మాట్లాడుతున్న తీరుపై సమావేశంలో సీఎం కేసీఆర్ అస‌హ‌నం , ఆగ్ర‌హం వ్యక్తం చేశారు . అయితే, ఈ కామెంట్ల విష‌యంలో ఆయ‌న కీల‌క విష‌యం మ‌ర్చిపోయార‌ని అంటున్నారు.

KCR-missed-those-simple-logic-says-senior-leader
KCR-missed-those-simple-logic-says-senior-leader

కేసీఆర్ ఎందుకు ఇలా?

సీఎం మార్పుపై నేతలు మాట్లాడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. తానే సీఎంగా ఉంటానని నేతలకు తేల్చి చెప్పారు. ఇకపై ఎవరైనా ఈ అంశంపై మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చరించారు . తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానన్న ఆయన ఎవరూ నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని అన్నారు. నా ఆరోగ్యం సహకరించకుంటే నేనే చెప్తా అప్పుడు ఎవర్ని సీఎం చేయాలన్నది మీతోనే మాట్లాడతా అని కేసీఆర్ అన్నారు. మీకంటే ఆత్మీయులు నాకెవ్వరూ లేరని అన్నారు. పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడితే చర్యలు తప్పవని కేసీఆర్ అనారు. అసెంబ్లీ సాక్షిగా నేనే సీఎం అని చెప్పా అని కూడా అన్నారు.

రాముల‌మ్మ‌కు చాన్స్ దొరికింది

మ‌రోవైపు , సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విలీనం పేరుతో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేశారని మండిపడ్డారు. `టీఆర్ఎస్ తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయని కేసీఆర్ అన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఇతర ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించకుండా కోవర్టు ఆపరేషన్లతో, కుట్రలతో అబద్ధపు దుష్ప్రచారాలతో ఎన్నో దుర్మార్గాలు చేసి, ఆ తర్వాత చర్చలని చెప్పి ఆ పార్టీలను తెలంగాణ ఐక్యత పేరుతో విలీనం చేయించి, ఆ పార్టీలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్ దే“ అంటూ మండిప‌డ్డారు.

సీఎం కుర్చీ విష‌యంలో…

తన కుర్చీ కుమారుడికి మారుతుందని అన్నందుకే… ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయి నేతలను బండకేసి కొడతానని… పార్టీ నుండి ఊడపీకుతానని ఎగిరి, దుమికి కేసీఆర్ విమ‌ర్శ‌లు చేశార‌ని విజ‌య‌శాంతి ఆరోపించారు. “సీఎం పదవి ఎడమ కాలి చెప్పుతో సమానం అని కేసీఆర్‌ చెప్పడం విడ్డూరం. అంత లెక్కలేని దానికి ఇన్ని తిట్లు, శాపనార్థాలు ఎందుకో? సీఎం పదవి గురించి మాట్లాడితే ఇంత ఆగం అవుతున్న కేసీఆర్ గారు, అయోధ్య గురించి, రిజర్వేషన్ ఉద్యోగుల గురించి అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కనీసం ఖండన చెయ్యకపోవడం గమనార్హం.” అంటూ విజయశాంతి నిప్పులు చెరిగారు.

author avatar
sridhar

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!