KCR: కేసీఆర్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం… ఇక అలాంటివి తెలంగాణ‌లో ఉండ‌వు

Share

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు. క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఈ మ‌హమ్మారికి చెక్ పెట్ట‌డంలో కీల‌క‌మైన వ్యాక్సిన్ పై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేస్తూ తెలంగాణ‌ వైద్య ఆరోగ్య‌శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వెంట‌నే కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిలిపివేయాలంటూ రాష్ట్ర హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు డీఎంహెచ్‌వోల‌కు ఆదేశాలు జారీ చేశారు.

ఎందుకు ఇలా?

జ‌న‌వ‌రి 25వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో వ్యాక్సినేష‌న్ జ‌రుగుతుంది. ప్ర‌స్తుతం 45 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సినేష‌న్ జ‌రుగుతుండ‌గా.. రేప‌టి (మే 1వ తేదీ) నుంచి 18 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది.. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు స‌ర్కార్.. వ్యాక్సిన్ల కొర‌త ఇప్ప‌టికే వెంటాడుతున్నందున 18 + ఏజ్ వాళ్ల‌కు వ్యాక్సిన్ సాధ్యం కాదంటున్నారు. ప్ర‌జ‌లందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామంటూ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ నిలిపివేశారు. ఇప్ప‌టివ‌ర‌కు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ను వినియోగించుకునే వీలు క‌ల్పించింది. మిగ‌తా టీకాల‌ను వెంట‌నే సేక‌రించాల‌ని హెల్త్ డైరెక్ట‌ర్ ఆదేశించారు.

డ్రోన్ ద్వారా వ్యాక్సిన్లు
మ‌రోవైపు “కోవిడ్-19” వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్ వినియోగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఏడాది పాటు ఈ విధానం అమల్లో ఉండటానికి డీజీసీఏ ఓకే చెప్పింది. పౌరుల ఇంటి వద్దకే “హెల్త్‌కేర్” సేవలు అందించడం కోసమే ఈ విధానం అమలులోకి వస్తుంది. అయితే వైద్య ఆరోగ్య సేవల పంపిణీ నేపథ్యంలో “కోవిడ్-19” వ్యాప్తి చెందకుండా నియంత్రించడం ప్రధానోద్దేశం. ప్రతిఒక్కరికీ, ఆరోగ్య సేవలు అందించడం డ్రోన్ సేవల లక్ష్యం. డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీపై అధ్యయనానికి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఈ పద్ధతి ఫలిస్తే వ్యాక్సిన్ పంపిణీలో కొంత భారం తగ్గుతుంది.


Share

Related posts

బిగ్ బాస్ 4 : నాకు షో కి వెళ్ళకముందే అభిజిత్ కాల్ చేశాడు, ఈ సారి అతనే విన్నర్ – యాంకర్ వర్షిణి

arun kanna

Today Horoscope ఫిబ్రవరి – 26 – మాఘమాసం – శుక్రవారం.ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

Sree matha

Gun fired: కడప జిల్లాలో కాల్పుల కలకలం…సోదరుడిని తుపాకీతో కాల్చి..ఆపై తాను..

somaraju sharma