KCR Vs YS Jagan: ఏపి ప్రాజెక్టులపై మరో సారి క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సీఎం కేసిఆర్..! ఏపి సీఎం జగన్ ఎలా స్పందిస్తారో..?

Share

KCR Vs YS Jagan: తెలంగాణ, ఏపి మధ్య జలజగడం కొనసాగుతూనే ఉంది. ఈ విషయం మరో సారి స్పష్టం అయ్యింది. తెలంగాణ సీఎం కేసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలోనే ఏపి చేపట్టిన రాయలసీమ లిఫ్ట్, ఆర్డీఎస్ కుడి కాల్వ పనులపై నిరసన వ్యక్తం చేశారు. కృష్ణాబేసిన్ లో ఏపి సర్కార్ అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని కేసిఆర్ సీరియస్ అయ్యారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం ఎంత వరకైనా పోరాడాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్. ఎన్జీటీతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఏపి ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని మండిపడ్డారు.

KCR Vs YS Jagan: AP Telangana water fight ts cabinet slams rayalaseema lift irrigation and rds
KCR Vs YS Jagan: AP Telangana water fight ts cabinet slams rayalaseema lift irrigation and rds

Read More: Justice Kanagaraj: ఎస్ఈసీ పదవి పోతేనేమీ..! జస్టిస్ కనగరాజ్ కు మరో పదవి ఆఫర్ చేస్తున్న జగన్ సర్కార్..! అది ఏమిటంటే..?

ఏపి తలపెట్టిన అక్రమ ప్రాజెక్టుల వల్ల పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్లు, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరుతో పాటు హైదరాబాద్ తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరుగనున్నదని పేర్కొంటూ తెలంగాణ సర్కార్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఏపి అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ప్రధాన మంత్రి, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి వినతి పత్రాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మరో పక్క ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల్లో ఏపి జలదోపిడీని ఎత్తిచూపాలని, రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమవేశాల్లోనూ ఈ అంశంపై మాట్లాడాలని కేబినెట్ తీర్మానించింది. అదే విధంగా కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను పూర్తిగా వినియోగించుకోవడానికి వీలుగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

KCR Vs YS Jagan: AP Telangana water fight ts cabinet slams rayalaseema lift irrigation and rds
KCR Vs YS Jagan: AP Telangana water fight ts cabinet slams rayalaseema lift irrigation and rds

కృష్ణానదిపై జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య అలంపూర్ వద్ద గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారురు గ్రామాల పరిధిలో జోగులాంబ బ్యారేజ్ నిర్మించి 60 -70 టీఎంసీల నీటిని తరలించాలని తీర్మానించింది. ఈ నీటిని పాలమూరు – రంగారెడ్డి పథకంలో భాగమైన ఏదుల రిజర్వాయిర్ కు ఎత్తిపోసి ..పాలమరు, కల్వకుర్తి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు అందించాలని నిర్ణయించింది. ఏపి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ సర్కార్ ఈ విధంగా స్పందించి కేబినెట్ లో తీర్మానాలు చేసిన నేపథ్యంలో ఏపి సీఎం వైఎస్ జగన్ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సార్వత్రిక ఎన్నికల ముందు నుండి ఇటీవల కాలం వరకూ సఖ్యతగా ఉన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్ ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా ఎందుకు ఉంటున్నారు? జల వివాదాల విషయంలో ఇరువురు చర్చించి సామసర్యంగా ఎందుకు పరిష్కరించుకోవడం లేదు? అన్నది మిలియన్ డాలర్ ల ప్రశ్నగా ఉంది.

 

 


Share

Related posts

జీశాట్-11 ప్రయోగం విజయవంతం-ఇస్రో ఖాతాలో మరో విజయం

Siva Prasad

మోడీ సర్కార్ పై ఉర్జిత్ బాంబ్

Siva Prasad

AP CS Adityanath das: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం పొడిగించిన కేంద్రం

somaraju sharma