NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: కేసీఆర్‌… జ‌గ్గారెడ్డి అనే వీరాధివీరుడి గురించి నీకు తెలుసా?

KCR: రాజ‌కీయ నేత‌ల్లో కొంద‌రికి మీడియాలో ఉండ‌టం ఇష్టం. ఇందుకోసం కొంద‌రు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తుంటారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ టార్గెట్ గా కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి తాజాగా చేసిన‌ వ్యాఖ్యలు ఈ కోవ‌లోకి చెందిన‌వే అంటూ ప‌లువురు కామెంట్ చేస్తున్నారు. గాంధీభవన్ లో జరిగిన విలేక‌రుల‌ సమావేశంలో జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ ఇటు కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త ప‌రిణామాల గురించి అటు ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి సైతం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Read More: L.Ramana: బిగ్ బ్రేకింగ్ః టీఆర్ఎస్‌లోకి ఎల్.ర‌మ‌ణ‌…

పార్టీలో ప‌రిస్థితి ఇది

తాను పీసీసీ అధ్య‌క్ష పీఠం ఇవ్వాల‌ని అడుగుతున్నప్ప‌టికీ ఢిల్లీ పెద్ద‌ల‌ చర్చల్లో తన పేరు లేకపోవడం దురదృష్టక‌ర‌మ‌ని జ‌గ్గారెడ్డి వాపోయారు. తెలంగాణ‌ ఉద్యమం ఉధృతంగా ఉన్నపుడు బాంబే హైవేపై మీద కేసీఆర్ ను అడ్డగించిన చరిత్ర తనది అని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. అలాంటి త‌న పోరాట ప‌టిమ త‌మ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ కు తెలియ‌క‌పోవడం తన దురదృష్టం అని జ‌గ్గారెడ్డి వాపోయారు. ఠాగూర్ తనపై చిన్న చూపు చూస్తున్నారని ఈ సంద‌ర్భంగా జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఠాగూర్ త‌న‌ను తెలంగాణలో బలమైన నాయకుడిగా గుర్తించకపోవడం త‌న దురదృష్టమని జ‌గ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధ్య‌క్ష ప‌ద‌వి విష‌యంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. పార్టీ సీనియ‌ర్ నేత వీహెచ్‌ను కొందరు బెదిరించడాన్ని ఖండిస్తున్నట్లు జ‌గ్గారెడ్డి తెలిపారు. బెదిరించేవారు ఫోన్ నంబర్ పెట్టాలని.. తాను వచ్చి మాట్లాడతానని వ్యాఖ్యానించారు.

Read More: Corona: వాట్సాప్ తో క‌రోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవ‌చ్చంటే…

కేసీఆర్ ను దించే మెడిసిన్ నా ద‌గ్గ‌రే
ఈ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. కేసీఆర్ ను రాజకీయంగా అడ్డుకోవడం తనతోనే సాధ్యమని జ‌గ్గారెడ్డి తెలిపారు. తెలంగాణ సీఎం ప‌ద‌వి నుంచి కేసీఆర్ ను గద్దె దింపే మెడిసిన్ తన దగ్గర ఉందని ఆయ‌న చెప్పుకొచ్చారు. తాను చెబుతున్నది కామెడీ కాదు సీరియస్ అని కూడా ఆయ‌న సూచించారు.

author avatar
sridhar

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju