NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IPS Lakshman naik: ఒక నాడు తెలంగాణ మంత్రి పదవి రేసులో కేరళ ఐపీఎస్..! నేడు ఉన్నత పదవికే ఎసరు..! ఎందుకంటే..?

IPS Lakshman naik: చెడు నడత కల్గిన వారితో స్నేహం, వారికి సహాయపడటం వల్ల ఎంతటి ఉన్నత పదవులలో ఉన్న వారు అయినా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందనీ, ఉద్యోగానికి సైతం తిప్పలు తప్పవని రుజువు చేస్తుంది ఈ ఘటన. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన గుగులోత్ లక్ష్మణ్ నాయక్ 1997 కేరళ కేడర్ ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ప్రస్తుతం కేరళ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ జనరల్ (ఐజీ) బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఓ మోసగాడికి అండగా నిలబడటం వల్ల సస్పెన్షన్ కు గురైయ్యారు. ఆయన సస్పెన్షన్ కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆమోదముద్ర వేశారు. ఏడీజీపీ ప్రమోషన్ లో ఉన్న ఆయనను ప్రభుత్వం పక్కన పెట్టేసింది.

kerala govt suspended IPS Lakshman naik
kerala govt suspended IPS Lakshman naik

 

Read More: YSRCP: రాబోయే ఎన్నికలకు వైసీపీ స్టార్ క్యాంపైనర్ ఎవరంటే..? షర్మిల స్థానం ఆమెతో భర్తీ..!?

IPS Lakshman naik: పురావస్తు డీలర్ తో లింక్

ఇదంతా ఎందుకు అంటే..పురావస్తు డీలర్ మాన్షన్ మావుంకల్ అనే మోసకారి స్నేహం అతని ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. మాన్షన్ మావుంకల్ పురావస్తు వస్తువులు విక్రయిస్తానంటూ చాలా మంది వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టాడు. ఈ ఐజీతో ఉన్న పరిచయం ఆధారంగా మాన్షన్ తన వ్యాపారాన్ని పెంచుకున్నారని అభియోగం. మాన్షన్ వద్ద ఉన్న వస్తువులను విక్రయించేందుకు ఏపికి చెందిన ఓ మహిళను లక్ష్మణ్ పరిచయం చేసినట్లు కూడా అధికారుుల గుర్తించారు. మాన్షన్ మావుంకల్ వల్ల నష్టపోయిన బాధితులు ఫిర్యాదుతో విచారణ జరిపిన పోలీసులకు ఐజీ లక్ష్మణ్ నాయక్ సహకారంపై ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి నివేదక అందజేశారు. దీంతో కేరళ ప్రభుత్వం ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకుంది.

తెలంగాణ మంత్రి పదవి రేసులో..

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. గత ఏడాది మొదట్లో గగులోతు లక్ష్మణ్ స్వచ్చంద పదవీ విరమణ ద్వారా తన 14 ఏళ్ల ఐపీఎస్ సర్వీస్ ను వదులుకుని టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని వార్తలు వచ్చాయి. తెలంగాణ సీఎం కేసిఆర్ ఆయనను మంత్రివర్గంలోకి కూడా తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. లక్ష్మణ్ నాయక్ పూర్వ ఏపి డీజీపీ డీటీ నాయక్ అల్లుడు. డీటీ నాయక్ కుమార్తె డాక్టర్ కవిత లక్ష్మణ్ నాయక్ సతీమణి. ఇప్పుడు లక్ష్మణ్ నాయక్ పై కేరళ ప్రభుత్వం వేటు వేయడంతో అటు కేరళ, ఇటు తెలంగాణలోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju