NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kerala Minister: ఏపిలోని ఈ సిస్టమ్ సూపరే సూపర్ అంటూ కేరళ మంత్రి కితాబు…!!

Kerala Minister: దేశంలో ఏ రాష్ట్రంలో అమలు జరగని విధంగా ఏపి (Ap)లో వాహనాల ద్వారా రేషన్ సరుకుల (PDS) డోర్ డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నా, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి (YS Jagan Govt) సర్కార్ సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఖర్చుతో కూడుకుని ప్రభుత్వానికి భారం అయినా రేషన్ సరుకులను వాహనాల ద్వారా డోర్ డెలివరీ అంటూ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపిలో అమలు అవుతున్న రేషన్ డోర్ డెలివరీ విధానం అధ్యయనం చేసేందుకు కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జిఆర్ అనిల్ రాష్ట్రాని (విజయవాడ) కి విచ్చేశారు. ఏపి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఈ విధానం గురించి ఆయనకు వివరించారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానాన్ని ఆ మంత్రి పరిశీలన చేశారు. అనంతరం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో సమావేశమైయ్యారు.

Kerala Minister Anil appreciation on ap ration door step delivery
Kerala Minister Anil appreciation on ap ration door step delivery

Read More: Indian National Congress: అపజయాల నుండి గుణపాఠం నేర్చుకోని కాంగ్రెస్…! మరో భాగస్వామ్య పక్షంతో వైరం..!!

Kerala Minister:  రేషన్ డోర్ డెలివరీ విధానం భేష్

దేశంలో ఎక్కడా 85 శాతం మందికి ఇంటింటికి బియ్యం పంపిణీ జరగడం లేదని పేర్కొన్న కేరళ మంత్రి అనిల్ ..ఈ విధానాన్ని కేరళలోనూ ప్రవేశపెట్టే ఆలోచనలో భాగంగా ఏపిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. బియ్యం పంపిణీ వ్యవస్థ, ధాన్యం సేకరణ, అర్హుల ఎంపిక, క్వాలిటీ కంట్రోల్, మార్క్ ఫెడ్, ఆర్ బీ కే ల పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపిలో సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ముంగిటకు చేరుతున్నాయని అన్నారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ ను అత్యంత పారదర్శకంగా చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఏపి నుండి కేరళకు బియ్యం రవాణా చేసే విషయంపై చర్చించినట్లు తెలిపారు.

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా

ఏపిలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ సచివాలయాలు, ఆర్ బీ కేలు, వాలంటీర్ లు, రేషన్ పంపిణీ వ్యవస్థ వంటి విప్లవాత్మక కార్యక్రమాలపై అధ్యయనం చేసేందుకు అనేక రాష్ట్రాల నుండి ఇక్కడకు రావడం గర్హకారణమని అన్నారు. సుమారు 65 లక్షల మందికి ఫించన్లు పంపిణీ చేసే కార్యక్రమం అయిదారు గంటల్లో పూర్తి చేసే సామర్ధ్యం ఏపిలో ఉందన్నారు.

 

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju