ఏపీ స్కీల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ స్కామ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో తాజాగా ఒకరిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. సీమెన్స్ కంపెనీ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్ ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మరో పక్క ఏపీ సీఐడీ నోటీసులతో రిటైర్డ్ ఐఆర్‌టీఎస్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ విచారణకు హజరైయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అర్జా శ్రీకాంత్ ను సీఐడీ అధికారులు విచారణకు పిలవగా, ఆయన సీఐడీ అధికారుల ముందు విచారణకు హజరైయ్యారు. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద శ్రీకాంత్ కు ఏపి సీఐడీ నోటీసులు జారీ చేసిందై. ఇంతకు గతంలోనూ శ్రీకాంత్ సీఐడీ విచారణకు హజరైయ్యారు.

కాగా ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో సీమెన్స్ కంపెనీ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్ ను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. ఢిల్లీ కోర్టులో హజరుపర్చారు. ఢిల్లీ కోర్టు ఆయనకు 36 గంటల ట్రాన్సిట్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను విజయవాడకు తీసుకువచ్చి కోర్టులో హజరుపర్చనున్నారు. సీమెన్స్ కంపెనీ వద్ద రూ.58 కోట్ల కు కొనుగోలు చేసినట్లు ఇన్ వాయిస్ ను సీఐడీ అధికారులు గుర్తించారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ విలువను రూ.3,300 కోట్లకు పెంచుతూ భాస్కర్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశారని సీఐడీ ఆరోపిస్తున్నది. ఏపికి చెందిన కొంత మంది ప్రమేయంతో ప్రాజెక్టు విలువ ను భాస్కర్ పెంచారని సీఐడీ అనుమానిస్తున్నది. భాస్కర్ చెప్పడం వల్ల ఏపి ప్రభుత్వం రూ.371 కోట్లు చెల్లించిందని అధికారులు చెబుతున్నారు. కొందరు అధికారులతో భాస్కర్ కుమ్మక్కు అయ్యారని తెలిపారు. అతని భార్య అపర్ణను స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ డిప్యూటి సీఈవోగా నియమించారనీ, పక్కా పథకంతో స్కామ్ చేసినట్లుగా సీఐడీ ఆరోపిస్తొంది. ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మందిని సీఐడీ అరెస్టు చేసింది.
గత టీడీపీ హయాంలో జరిగిన ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సీఐడీ పలు కీలక విషయాలను నమోదు చేసింది. 2015 జూన్ లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో ఆర్ధిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని గుర్తించింది. జీవో నెం.4 ప్రకారం డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్కర్, సీమెన్స్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ కు గత ప్రభుత్వం రూ.241 కోట్లు కేటాయించిందని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే ఈ సొమ్ము అప్పగించిందని వెల్లడించింది. ఈ సొమ్మును ఏడు షెల్ కంపెనీలకు తప్పుడు ఇన్ వాయిస్ లు సృష్టించి తరలించారని తెలిపింది. 2017 – 18 సంవత్సరంలో రూ.371 కోట్ల రూపాయలలో దాదాపు రూ.241 కోట్లు గోల్ మాల్ జరిగినట్లుగా సీఐడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నది.
Enforsment directorate: మీరు చెప్పినట్లుగానే రండి