Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిర్ధార్ధ్ రెడ్డికి కీలక పదవి.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్..

Share

Byreddy Siddharth Reddy: వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డికి నామినెటెడ్ పదవుల పందేరంలో కీలక పదవి లభించింది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సిద్ధార్ధ్ కి కీలకమైన ఏపి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. గడచిన సార్వత్రిక ఎన్నికల సమయంలో నందికొక్కూరు నియోజకవర్గంలో వైసీపీ విజయానికి సిద్ధార్ధ్ కీలక పాత్ర పోషించారు. తరువాత ఎమ్మెల్యే ఆర్ధర్, సిద్ధార్థ్ మధ్య విబేధాలు బహిర్గతం అయ్యాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో కర్నూల్ జిల్లా ఇన్ చార్జి మంత్రి అనిల్ కుమార్ ఇద్దరి మధ్య రాజీ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

Key post for Byreddy Siddharth Reddy
Key post for Byreddy Siddharth Reddy

Read More: AP Nominated Posts: బిగ్ బ్రేకింగ్..టీటీడీ చైర్మన్ గిరీ మళ్లీ వైవీ సుబ్బారెడ్డికే..!?..నామినెేటెడ్ పోస్టుల్లో మహిళా నేతలకు పెద్దపీట..!!

గతంలో నందికొక్కూరు ప్రచార సభలో బైరెడ్డి సిద్ధార్థ్ కి మంచి ప్రాధాన్యత గల పోస్టు ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయనకు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవి ఇవ్వడంతో అప్పుడు జగన్ ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేర్చారని సిద్ధార్ధ్ అభిమానులు పేర్కొంటున్నారు. బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ప్రకటించగానే బైరెడ్డి ఇంటి వద్ద, పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు హంగామా చేశారు. స్పీట్లు పంపిణీ చేసి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.


Share

Related posts

ప్రధాని మోడీకి సొంత రాష్ట్రం పెద్ద షాక్..! గుజరాత్ సీఎం వెర్సెస్ పీఎం మోడీ

Muraliak

Hair Color: జుట్టుకు వేసుకునే రంగుల్లో ఏది మంచిదో తెలుసా!!

Kumar

Paagal : పాగల్ – నివేత రొమాంటిక్ సాంగ్ అదుర్స్..

bharani jella