33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏటవుద్ది.. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుద్ది – కొడాలి

Share

జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలోకి నారా లోకేష్ అహ్వానించడంపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తన దైన శైలిలో స్పందిస్తూ చంద్రబాబు, లోకేష్ ల తీరును విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్మోహనరెడ్డి పరిపాలనలో సంతోషంగా ఉన్నారనీ, రాష్ట్రంలో మార్పు కావాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. తండ్రీ కొడుకులు (చంద్రబాబు, లోకేష్) మాత్రమే రాష్ట్రంలో మార్పు కావాలి, అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత హరికృష్ణ రథ సారధిగా ఎన్టీఆర్ చైతన్య రథంపై 40 వేల కిలో మీటర్లు పర్యటన సాధించి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. తన తండ్రి (హరికృష్ణ), తాత (ఎన్టీఆర్) రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి అసలైన రాజకీయ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ యేనని పేర్కొన్న కొడాలి నాని.. అటువంటి ఆయన (ఎన్టీఆర్) ను లోకేష్ పార్టీ లోకి అహ్వానించడం ఏమిటి అని ప్రశ్నించారు. లోకేష్ కు ఏ అర్హత ఉందని అన్నారు. కనీసం వార్డుకు కూడా గెలవలేడు. శాససనభకు పోటీ చేసిన ఓడిపోయాడన్నారు.

Kodali Nani Slams Lokesh

 

రాష్ట్రంలో  మార్పు రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తారనీ అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మార్పు ఎవరు కోరుకుంటున్నారన్నారు. అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతో జగన్మోహనరెడ్డి పరిపాలన సాగుతోందనీ, ఈ పాలన పది కాలాల పాటు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని కొడాలి నాని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు, లోకేష్ తహతహలాడిపోతున్నారనీ, కానీ చంద్రబాబు వల్ల కావడం లేదన్నారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఈ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. కొడుకు లోకేష్ నాలుగువేల కిలో మీటర్ల పాదయాత్ర అంటూ చేపట్టాడనీ, తండ్రి నోవాటెల్ హోటల్ కు వెళ్లి మమ్మల్ని సపోర్టు చేయి, మా వెనకాల ఉండాలంటూ పవన్ కళ్యాణ్ ని అడిగి వచ్చారన్నారు. మరో పక్క ఢిల్లీలో కొంత మంది వ్యక్తులను పెట్టి బీజేపీని కూడా కలవాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక వేళ బీజేపీ కలవకపోతే కాంగ్రెస్, సీపిఐ, సీపీఎంలను కలుపుకోవడానికి ప్రయత్నం చేశాడన్నారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తూ, జగన్మోహనరెడ్డికి వ్యతిరేకత ఉందని చెబుతూ కూడా తండ్రి, కొడుకులు తమ అధికారం కోసం జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నారనీ వీళ్లకు ఏమైనా బుద్ది ఉందా అని ప్రశ్నించారు.

 

ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ప్రస్తుతం లేదనీ, ముఖ్యమంత్రి మారాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు తండీ కొడుకులను విశ్వసించడం లేదన్నారు. కాబట్టి ఎంత మంది వచ్చినా విశ్వాసం లేనటువంటి నమ్మక ద్రోహులను ప్రజలు గెలిపించే పరిస్థితి ఉండదన్నారు. మార్పు రావాల్సింది రాష్ట్రంలో కాదనీ, మార్పు రావాల్సింది తెలుగుదేశం పార్టీలోనని అన్నారు.  చంద్రబాబుకు విశ్వసనీయత లేదన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో సర్వనాశనం అయిపోయిందనీ, ఇక్కడ మంగళగిరిలో లోకేష్, కుప్పంలో చంద్రబాబు ఓడిపోయే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఇటువంటి విశ్వసనీత లేని వ్యక్తిని ఎంత మంది సపోర్టు చేసినా పార్టీ ప్రతిపక్షంలోకి కూడా రాదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తే అదే ప్రతిపక్షంలోకి వస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ రాదని అన్నారు కొడాలి నాని. ఎన్టీఆర్ మనుమడుగా జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించడం మంచిదన్న కొడాలి.. కనీసం ఆ పార్టీ ప్రతిపక్షంలో అయినా ఉండాలంటే జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ అప్పగించాలన్నారు. చంద్రబాబు తప్పుకుని జూనియర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా అయినా రాష్ట్రంలో దక్కుతుందన్నారు.

2024 ఎన్నికల తర్వాత అయినా పార్టీ శ్రేణులు చంద్రబాబు, లోకేష్ ను తన్ని తరిమేసి పార్టీని ఏలాగూ వాళ్లకే అప్పగిస్తారని అన్నారు కొడాలి నాని. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణను చంద్రబాబు ఘోరంగా అవమానించలేదా అని ప్రశ్నించారు. హరికృష్ణను పదవులు ఇవ్వకుండా దూరం చేశారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలివేశారని విమర్శించారు. 2014 లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాడు గ్యాలరీలో కూర్చోబెట్టి అవమానించారని గుర్తు చేశారు. చంద్రబాబు, లోకేష్ బొమ్మతో ఓట్లు అడిగే దైర్యం లేదని అన్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను రమ్మంటున్నారని విమర్శించారు.  చంద్రబాబు నాయకత్వంలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని కొడాలి స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని కొడాలి వ్యాఖ్యానించారు.

వైఎస్ వివేకా హత్య కేసుపై సజ్జల సంచలన కామెంట్స్ .. జగన్ పై చంద్రబాబు కుట్రలు అంటూ..


Share

Related posts

ఆడవారిని ఆకర్షించాలి అంటే మగవాళ్ల లో ఈ లక్షణాలు ఉండి తీరవలిసిందే!!

Kumar

Ananya pande : ఐకాన్ స్టార్‌తో అనన్య పాండే..?

GRK

బిగ్ బాస్ 4: ఉన్న కొద్దీ ఆ టాప్ కంటెస్టెంట్ గ్రాఫ్ కిందకి…??

sekhar