NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ పై హత్యాయత్నం కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా..జగన్ తరపు న్యాయవాది వాదనలు ఇలా..

ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పై కోడికత్తితో జరిగిన దాడి కేసు విచారణ మరో సారి వాయిదా పడింది. ఈ కేసు విచారణను ఎన్ఐఏ కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఇవేళ ఎన్ఐఏ కోర్టు ముందుకు  కేసు విచారణ కు రాగా.. జగన్ తరపు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఎన్ఐఏ, నిందితుడి తరపున న్యాయవాదులు వేసిన కౌంటర్ లపై న్యాయవాది వెంకటేశ్వర్లు వాదించారు. ఈ కేసులో ఫైనల్ రిపోర్టు వెయ్యనందున సామాన్యులు ఎవరైనా విచారణ ఇంకా జరుగుతూనే ఉందనుకుంటారని తెలిపారు. రాష్ట్ర పోలీసులు విడుదల చేసిన ఫ్లెక్సీ.. నిందితుడు వైసీపీ సానుభూతిపరుడు అని చెప్పేందుకు కావాలని ప్రయత్నించారన్నారు. నిందితుడి కుటుంబానికి జన్మభూమి కమిటీ ద్వారా ఇంటి స్థలం మంజూరు అయిందని కోర్టుకు తెలిపారు. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్, టీడీపీతో సంబంధాలు ఉన్న వ్యక్తికి విమానాశ్రయంలో ఎలా ఉద్యోగం ఇచ్చారని ప్రశ్నించారు. ఇవన్నీ అనేక అనుమానాలకు కారణం అవుతున్నాయని అన్నారు.

kodikatthi case hearing adjourned to 20th of april vijayawada nia court

బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయించాలని అడిగే హక్కు ఉంటుందని ఆయన వాదనలు వినిపించారు. సాక్షం నమోదునకు అడ్వకేట్ కమిషనర్ ను నియమించాలని అభ్యర్ధించారు. కోడికత్తి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 23 రోజుల్లోనే ఎన్ ఐ ఏ అభియోగ పత్రం దాఖలు చేసిందనీ, అయితే అంత తొందరగా అభియోగం పత్రం ఎలా దాఖలు చేయగలుగుతారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 39 మంది సాక్షులను అయిదు రోజులోనే విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేశారన్నారు. ఒకే రోజున 35 మంది సాక్ష్యాలను విచారించారని, మూడు బృందాల అధికారులు ఈ విచారణ చేశారని తెలిపారు. చార్జీ షీట్ చదివితే తదుపరి దర్యాప్తు అవసరమని సాధారమ పౌరుడికి అర్ధం అవుతుందని చెప్పారు. జగన్ వ్యాంగ్మూలాన్ని అదనపు ఎస్పీ తీసుకున్నారన్నారు. నిందితుడు సోదరుడు సుబ్బరాజు తను టీడీపీ పార్టీ అభిమానిని అని చెప్పుకున్నారు అంటూ ప్రస్తావించారు. సరైన విచారణ జరగాలని కోరుకోవడం బాధితుడికి ఉన్న హక్కు అని తెలిపారు.

నిందితుడు మెడ మీద పొడవాలనుకున్నాడు అని ఎన్ ఐ ఏ తన కౌంటర్ లో పేర్కొందని, అంటే హత్య చేయాలని దీని వెనుక ఉన్న బలమైన అంశమన్నారు. దీని వెనుక కుట్ర ఉన్నట్లే కదా., ఎందుకు ఎన్ ఐఏ ఈ కుట్రను వెలికి తీయలేదని వెంకటేశ్వర్లు వాదించారు. ఎన్ఐఏ సమగ్ర విచారణ చేసింది అనడాని ఆధారంగా ఉండే వస్తువులు, ప్లెక్సిని అధికారులు న్యాయమూర్తి ముందు ప్రదర్శించారు. నిందితుడికి రెండు ఈ మెయిల్స్ ఉన్నాయనీ, వాటిని దర్యాప్తు సంస్థ పట్టించుకోలేదన్నారు. ప్రైవేటు సెక్యురిటీ తనిఖీ చేసిన తర్వాతనే రెస్టారెంట్ లోకి ఉద్యోగులను అనుమతిస్తారని హర్షవర్థన్ చెప్పారనీ, ఈ పాయింట్ ను ఎన్ఐఏ పట్టించుకోలేదని జగన్ తరపు న్యాయవాది తెలిపారు. కాగా, తమ వాదనలు వినిపించడానికి సమయం కావాలని ఎన్ఐఏ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో విచారణను ఎన్ఐఏ కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.

Breaking: కర్ణాటకలో ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం జగదీశ్ షెట్టర్

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!