Konaseema: కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ అమలావురంలో కోనసీమ సాదన సమితి చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ఆందోళన కారులు ప్రయత్నించారు. వీరిని పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయగా పోలీసులపై రాళ్లు రువ్వారు. జిల్లా ఎస్పీ వాహనంపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడుల్లో కొంత మంది పోలీసులకు గాయపడ్డారు. పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ తరుణంలో పలువురు ఆందోళన చేస్తున్న యువకులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పోలీసులు కొంత మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మారుస్తూ రెవెన్యూ శాఖ ఇటీవల ప్రాధమిక ప్రకటన జారీ చేసింది. దీనిపై అభ్యంతరాలు,సూచనలు 30 రోజుల్లోగా కలెక్టర్ కు తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో కోనసీమ పేరునే జిల్లాకు కొనసాగించాలని పెద్ద సంఖ్యలో యువకులు ఆందోళనకు దిగడంతో హింసాత్మకంగా మారింది.
ఈ ఆందోళనలపై మంత్రులు తానేటి వనిత, విశ్వరూప్ లు స్పందించారు. జిల్లాకు అంబేద్కర్ పేరు ను వ్యతిరేకించడం సరికాదని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. దీని వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయన్న అనుమానం ఉందని చెప్పారు. కోనసీమ ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ పేరు పెట్టామని అన్నారు. ఆందోళనకారులు తన ఇంటికి నిప్పు పెట్టడం దురదృష్టకరమని అని మంత్రి విశ్వరూప్ అన్నారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన డిమాండ్ చేశాయన్నారు. జనసేన అంబేద్కర్ పేరు పెట్టాలని నిరసనలు కూడా చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు చేస్తున్న కుట్రలు ఇవి అని ఆయన ఆరోపించారు. ప్రస్తుత సమయంలో అందరూ సంయమననం పాటించాలని మంత్రి విశ్వరూప్ విజ్ఢప్తి చేశారు.
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…