NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Krishna : జర్నలిస్టులకు ఝలక్ ..! ఆ డీఈఓ ఇచ్చిన ట్విస్టు మామూలుగా లేదు..!!

Krishna : రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని వాటిని అమలు చేశారు. నవరత్న పథకాల అమలునకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అప్పులు తెచ్చి మరీ పంపిణీలు కొనసాగిస్తున్నారు. కానీ జర్నలిస్ట్ ల పట్ల జగన్ సర్కార్ చిన్న చూపు చూస్తోంది. జర్నలిస్ట్ సంఘాల నేతల ఆందోళనలు ఏ మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతంలో అక్రిడిటేషన్ కమిటీలో అధికారులతో పాటు జర్నలిస్ట్ సంఘాల నేతలు సభ్యులుగా ఉండే వారు. తొలి సారిగా జగన్ సర్కార్ లో జర్నలిస్ట్ సంఘాలు లేకుండా అధికారులతో కమిటీని వేశారు. ఫిబ్రవరి నెల వస్తున్నా ఇంత వరకూ అర్హులైన జర్నలిస్ట్ లకు అక్రిడిటేషన్ లు మంజూరు చేయలేదు. తద్వారా వచ్చే బస్సు పాసులు ఇవ్వలేదు.

Krishna deo circular on journalist
Krishna deo circular on journalist

ఇప్పుడు తాజాగా కృష్ణా జిల్లాలో జరిగిన ఓ తాజా పరిణామం ప్రభుత్వ పెద్ద ఆగ్రహం వల్లనే జరిగిందని అనుకుంటున్నారు. గత నాలుగైదు సంవత్సరాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ పిల్లలకు ప్రైవేటు, ఎయిడెట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నారు. ఇందుకు గానూ ఆయా జిల్లాల జిల్లా కలెక్టర్ ల ఆదేశాల మేరకు డీఈఓలు సంబంధిత విద్యాసంస్థలకు సర్క్యులర్ లు జారీ చేసేవారు. అదే విధంగా ఈ ఏడాది కూడా కృష్ణా జిల్లాలో జర్నలిస్ట్ ల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ సౌకర్యం కల్పిస్తూ నిన్న అంటే ఈ నెల 19వ తేదీన డిఈఓ ఎంవి రాజ్యలక్ష్మి సర్క్యులర్ జారీ చేశారు.

ఆ తరువాత ఏమి జరిగిందో ఏమో, ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారో గానీ 24 గంటలు గడవక ముందే ఈ రోజు (20వ తేదీ) ఆ ఉత్తర్వులు రద్దు చేస్తూ మరో సర్క్యులర్ జారీ చేశారు. రాయితీ ఇచ్చినట్లే ఇచ్చి మరుసటి రోజే తూచ్ ఆ ఉత్తర్వులు చెల్లవు అంటూ మరో ఉత్తర్వులు ఇవ్వడాన్ని జర్నలిస్ట్ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. ప్రభుత్వం జర్నలిస్ట్ ల పట్ల చిన్నచూపు చూస్తుంది అనడానికి ఇది మరొక ఉదాహారణ అని పేర్కొంటున్నారు.

Krishna deo circular on journalist
Krishna deo circular on journalist

author avatar
sharma somaraju Content Editor

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk