KTR Meets YS Jagan: ఇటీవల కాలం వరకూ ఆ పార్టీ నేతలు ఈ ప్రభుత్వ పాలనపై విమర్శించారు. వీళ్లు ఆ పార్టీ నేతలను విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ చేసుకున్నారు. ఆ రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంట, విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఉన్నాయంట అంటూ తెలంగాణ మంత్రి కేటిఆర్ విమర్శలు గుప్పించారు. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు స్పందించారు. కాస్త సాఫ్ట్ గా ప్రతి విమర్సలు చేశారు. ఆ తర్వాత మంత్రి కేటిఆర్…ఏదో టంగ్ స్లిప్ అయ్యింది, సోదరుడు జగన్ పాలనను కించపర్చాలని ఉద్దేశం లేదంటూ వివరణ ఇవ్వడంతో విమర్శలు, ప్రతి విమర్శలు ఆగిపోయాయి. అంతకు ముందు తెలంగాణ సీఎం కేసిఆర్ సైతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడినా ఏపి సీఎం వైఎస్ జగన్ వీటిని అంతగా పట్టించుకోలేదు. సరిహద్దు రాష్ట్రంతో సామరస్యంగా ఉండాలన్న ఆలోచనే ఏపి సీఎం జగన్ కు మొదటి నుండి ఉండేది. కాకపోతే నదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య పంచాయతీ ఇంకా తీరలేదు. విద్యుత్ బాకీల చెల్లింపులు జరగలేదు. ఇవన్నీ ఎలా ఉన్నా.. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న ఏపి సీఎం వైఎస్ జగన్, తెలంగాణ మంత్రి కేటిఆర్ పరస్పరం అప్యాయంగా కలుసుకుని మాట్లాడుకోవడం విశేషం.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
KTR Meets YS Jagan: దావోస్ లో జగన్, కేటిఆర్ అప్యాయంగా పలకరింపులు
రాష్ట్రాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల మంత్రులు దావోస్ సదస్సులో పాల్గొని పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా తమ తమ రాష్ట్రాల్లో అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. తమ తమ రాష్ట్రాల్లో ఉన్న వనరులు, ప్రభుత్వ సహకారం తదితర విషయాలను వెల్లడిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. రూ.500 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను తెలంగాణ లో నెలకొల్పేందుకు లూలూ గ్రూపుతో మంత్రి కేటిఆర్ ఒప్పందం చేసుకున్నారు. 60వేల కోట్ల పెట్టుబడితో పంప్ హైడల్ పవర్ స్టోరేజీ తో పాటు సోలార్ పవర్ ఉత్పత్తి ప్రాజెక్టును ఏపిలో నెలకొల్పేందుకు ఆదానీ గ్రూపుతో ఏపి సీఎం వైఎస్ జగన్ ఒప్పందం చేసుకున్నారు. ఇలా రాష్ట్రాల్లో పెట్టుబడులు తేవడానికి పోటీ పడుతున్న ఈ ఇద్దరూ నేతలు వివిధ కంపెనీలతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంలో ఏపి సీఎం వైఎస్ జగన్ ను కలుసుకున్న తెలంగాణ మంత్రి కేటిఆర్ ఈ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నా సోదరుడు, ఏపి సీఎం వైఎస్ జగన్ తో సమావేశం గొప్పగా జరిగింది అని ట్వీట్ లో పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను దెబ్బతీసుకోకుండా ఆప్యాయతతో ఉంటూ పరస్పర సహకారంతో ముందుకు సాగడం అభినందనీయమే.