NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Kuppam: బాబు ప్రత్యర్ధి మారినట్టే ..? జగన్ – పెద్దిరెడ్డి యాక్షన్ ప్లాన్ రెడీ..?

Kuppam: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో కైవశం చేసుకోవాలనేది వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్దం చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన గెలుపును చూసి ఇక కుప్పంలో వైసీపీ బలపడింది భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా కుప్పంలో వైసీపీ అభ్యర్ధిగా ఎవరు నిలబడబోతున్నారు..? ఇప్పుడు ఉన్న వైసీపీ ఇన్ చార్జి భరత్ కు టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారా.? లేదా.. కుప్పం వైసీపీలో అంతర్గతంగా ఏమి జరుగుతోంది..? అని పరిశీలన చేస్తే..

Kuppam chandrababu ycp action plan

 

Kuppam: పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుండే..?

ఎవరు అభ్యర్ధి అయినా చంద్రబాబు ఓడిపోవాలి. నెక్ట్స్ అసెంబ్లీలోకి చంద్రబాబు అడుగు పెట్టకూడదు. ఇది ఒక్కటే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, అక్కడి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్. అందుకే తన కుటుంబం నుండే ఒకరిని దింపాలని పెద్దిరెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిత్తూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఉంది. తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పుంగనూరు నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు. రాజంపేట ఎంపిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు. ఆ కుటుంబం నుండి ఇప్పటికే మూడు సీట్లు ఉన్నాయి. ఇప్పుడు నాల్గవ సీటు కుప్పం నుండి కూడా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నారు. యువ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడి కుమారుడు. ఈ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆలోచనను సీఎం జగన్మోహనరెడ్డి కాదనే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్దిరెడ్డికి జగన్ పూర్తి స్థాాయి స్వేచ్చ ఇచ్చేశారు.

Kuppam: వన్యకుల క్షత్రియ ఓటింగ్ కీలకం

కుప్పంలో సామాజిక సమీకరణాలు చూసుకుంటే వన్యకుల క్షత్రియ ఓటింగ్ ఎక్కువ. దాదాపు 65 నుండి 70వేల ఓట్లు ఈ సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. వీళ్లు బీసీ సామాజికవర్గం కింద వస్తారు. వీళ్లతో పాటు బలిజ (కాపు) సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ. ఈ సామాజికవర్గం 40 నుండి 42 వేల వరకూ ఉంటారు. ఈ రెండు సామాజిక వర్గాలతో పాటు ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గ ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం మీద రెడ్డి, కమ్మ సామాజికవర్గ ఓట్లు చాలా తక్కువ. రెడ్డి సామాజికవర్గం కంటే కమ్మ సామాజికవర్గం ఓట్లు తక్కువే. రెడ్డి కమ్యూనిటీ వాళ్లు 15 నుండి 20వేల వరకూ ఉంటే..కమ్మ సామాజికవర్గం మాత్రం 5 నుండి 6వేల వరకూ మాత్రమే ఉంటారు.

CM YS Jagan 1000 Days: How Many Marks..!?

Kuppam: ఇతర సామాజికవర్గాలకు పదవులు

అక్కడ వన్యకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన భరత్ కు వైసీపీ ఎమ్మెల్సీ ఇచ్చింది. అదే విధంగా బలిజ సామాజికవర్గానికి చెందిన కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. దానితో పాటు మున్సిపల్ చైర్మన్ గా బీసీ సామాజికవర్గ నేతకు అవకాశం ఇచ్చారు. మూడు సామాజికవర్గాల వారికి మూడు భిన్నమైన పదవులు ఉన్నాయి. ఇప్పుడు రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యేగా ప్రకటిస్తే ఇతర సామాజికవర్గాలకు పదవులు ఇచ్చినందున సామాజిక న్యాయం చేసినట్లు ఉంటుంది. దీంతో కుప్పం ఈజీగా గెలవవచ్చు అని వైసీపీ లెక్క. వచ్చే ఎన్నికల నాటికి కుప్పంలో వైసీపీ వ్యూహాలు ఇలా ఉన్నాయి.

author avatar
Srinivas Manem

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!