PV Sindhu: పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ కు విశాఖలో భూమి కేటాయిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ..!!

land allot to PV Sindhu badminton academy and sports school at Vishakhapatnam
Share

PV Sindhu: పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ కు జగన్ సర్కార్ భూమి కేటాయించింది. విశాఖ రూరల్ మండలం చిన గదిలిలో భూమి కేటాయిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. సర్పే నెం.72,83 లో రెండు ఎకరాలు అకాడమీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా ప్రయోజనం దృష్యా భూమి ఉచితంగా కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది.  అకాడమికి సింధు రూ.5కోట్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెండు దశల్లో పీవీ సింధు బాడ్మింటన్ అకాడమీ నిర్మాణం జరగనుంది. పేద పిల్లల్లో ప్రతిభ గుర్తించి ప్రోత్సహాంచాలని ప్రభుత్వం సూచించింది.

land allot to PV Sindhu badminton academy and sports school at Vishakhapatnam
land allot to PV Sindhu badminton academy and sports school at Vishakhapatnam

ఈ ఏడాది మే నెలలోనే స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు ప్రభుత్వం ఈ నజరానా ప్రకటించింది. రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా విశాఖలో రెండు ఎకరాల స్థలం కేటాయించాలని నిర్ణయించింది. సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఈ స్థలంలో అకాడమీ ఏర్పాటు చేయనున్నారు.

Read More: Ashok Gajapati Raju: విజయసాయి వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పిన అశోక్ గజపతిరాజు..!!

బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి స్థలం కేటాయించినందుకు సీఎం వైఎస్ జగన్ కు సింధు కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమి లేనందు వల్ల అక్కడ అత్యున్నత స్థాయి మౌలిక వసతులతో అకాడమీ ఏర్పాటు చేయాలని భావించినట్లు సింధు గతంలోనే తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత అకాడమీ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. తొలి దశలో అకడామీ నిర్మాణం తర్వాత దశలో స్పోర్స్ట్ స్కూల్ ఏర్పాటు ప్రతిపాదన చేస్తున్నట్లు చెప్పారు. బ్యాడ్మింటన్ నుండి రిటైర్ అయిన తర్వాత అకాడమీ లో శిక్షణ బాధ్యతలను చేపడతానని సింధు వెల్లడించారు.

land allot to PV Sindhu badminton academy and sports school at Vishakhapatnam
land allot to PV Sindhu badminton academy and sports school at Vishakhapatnam

Share

Related posts

నేరుగా వాళ్ల ఖాతాలోకే ! జగన్ డేరింగ్ నిర్ణయంతో ఉలిక్కిపడ్డ ‘డబ్బునోళ్లు’!!

Yandamuri

Dubai: అక్కడ పార్టీకి వెళ్లినందుకు రూ. 3 లక్షలు ఫైన్ విధిస్తారా!!

Naina

ఆ ఒక్క ‘టీ’తో నెలకు లక్షలు సంపాదిస్తున్న హైదరాబాదీ..!

Teja