AP Politics ; Ganta Resignation Insider Reasons
వైసీపీలోకి గంటా వస్తే నా పరిస్థితి ఏంటని మంత్రి అవంతి శ్రీనివాస్ నానా యాగీ చేసి పారేశారు. ఏం జరిగిందో తెలియదుకానీ గంటా వైసీపీ గృహప్రవేశం ఆగిపోయింది. అసలు గంటాను పట్టించుకోవడమే మానేశారు. ఏపీ బీజేపీ చీఫ్ కాకముందు సోము వీర్రాజు విశాఖ వెళ్లి గంటాతో భేటీ అయ్యారు. దాంతో ఆయన కాషాయ కండువా కప్పుకొంటారని భావించారు. ఆ టాక్ కూడా బ్రేక్ అయిపోయింద.ఇ ఈ నేపథ్యంలో గంటా పొలిటికల్ కెరీర్ ఏంటనే చర్చ జరుగుతోంది.
గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం సంగతేమో కానీ ఆయన గురించి మీడియాలో లీకులు మాత్రం ఓ రేంజ్లో బయటకొస్తాయి. దీనికి ఆయన చర్యలు కూడా కారణమే! గంటా పార్టీ మార్పుపై ఊహాగానాలకు ప్రధాన కారణం ఆయన తీరు. సొంత పార్టీ అయిన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీకి రారు.. రిజిస్టర్లో అటెండెన్స్ కోసం ఓ రోజు వచ్చి కనిపించి వెళ్తారు. వైసీపీలో చేరిపోతున్నారని ఆయన వెనకున్న బ్యాచ్ మీడియాకు లీకులు ఇచ్చారు. సీఎంతో నేరుగా మాట్లాడేశారంటూ చెప్పుకొన్నారు. అయితే, ఇక్కడి ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ YCP ఎంపీ విజయసాయిరెడ్డి స్వయంగా విశాఖ నార్త్‌లో ఏర్పాటు చేసిన ఓ సభలో కామెంట్ చేశారంటే గంటా రేంజ్ ఏంటో తెలుసుకోవచ్చు.
బీజేపీలో చేరిక గురించి అయితే ఓ రేంజ్లో ప్రచారం జరిగింది. ఏపీలో బలపడాలి అనుకుంటున్న బీజేపీకి ఇప్పుడు కాపుల బలం కావాలి. కాబట్టి తన అవసరం వాళ్లకు ఉంది. అందుకే రమ్మంటున్నారని సారే మళ్లీ సొంత బ్యాచ్‌తో లీకులు ఇప్పించారని టాక్. ఈ ఎపిసోడ్ కొన్నాళ్లు చర్చలో ఉన్నా.. ఇప్పుడు చడీ చప్పుడు లేదు. మొత్తంగా కీలక పార్టీలన్నింటి గురించి ఇదే టాక్ వచ్చిన నేపథ్యంలో … అసలు వాళ్లూ వీళ్లు ఎవరూ ఇప్పుడు గంటా గురించి ఆలోచించే పరిస్థితి లేదని.. ఉనికి కోసం ఆయన మాత్రమే తాపత్రయ పడుతున్నారని ప్రచారం జరుగుతోంది. తాను టీడీపీలోనే ఉన్నాను.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని మళ్లీ లీకులు మొదలయ్యాయని అంటున్నారు.
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…