NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్‌ను అడ్డంగా బుక్ చేసిన ఏపీ మంత్రి ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రుల చ‌ర్య‌ల విష‌యంలో ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ ఓ రేంజ్‌లో దృష్టి సారించిన విష‌యం తెలిసిందే. మంత్రుల చ‌ర్య‌ల‌ను గ‌మ‌నిస్తూ ఎక్క‌డ అవ‌కాశం దొర‌కుతుందా అని ప్ర‌తిప‌క్షం ఎదురుచూస్తోంది. ఇలాంటి స‌మయంలో తాజాగా ఓ మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌రిగిన ఘ‌ట‌న‌ను టీడీపీ రెచ్చ‌గొట్టే రీతిలో ఉప‌యోగించుకుంటోంద‌ని ప‌లువురు అంటున్నారు.

అస‌లేం జ‌రిగింది?

మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ జిల్లా పాడేరులో ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. కరోనాకు ఎదురొడ్డి ప్రజల ప్రాణాలు కాపాడిన త‌మ‌కు నాలుగు నెలలుగా జీతాలు అంద‌లేద‌నే భావ‌న‌తో కొంద‌రు న‌ర్సులు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు ప‌లు మీడియా సంస్థ‌ల్లో వ‌చ్చింది. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించినందుకు వారిని అదుపులోకి తీసుకున్న‌ట్లు ఆయా మీడియా సంస్థ‌లు పేర్కొన్నాయి. అయితే, ఈ ఘ‌ట‌న‌పై తెలుగుదేశం పార్టీ మండిప‌డుతోంది. కరోనాపై పోరాటంలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆది నుంచి నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. విశాఖ జిల్లా పాడేరులో మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనాన్ని అడ్డుకున్న నర్సుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు.

ప్రాణాలు కాపాడితే …

కరోనాకు ఎదురొడ్డి ప్రజల ప్రాణాలు కాపాడిన నర్సులకు నాలుగు నెలలుగా జీతాలివ్వకపోడం దుర్మార్గమ‌ని వంగ‌ల‌పూడి అనిత మండిప‌డ్డారు. “జీతాలు కావాలని మంత్రి అవంతిని అడిగితే మగ పోలీసులతో నర్సులపై దౌర్జన్యం చేయించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కారు నుండి దిగి నర్సులు ఎందుక ఆందోళన చేస్తున్నారో కూడా అడిగేంత తీరిక లేదా మంత్రికి ? అధికారం తమదనే అహంకారంతో మంత్రి కారు దిగలేదు. “ అంటూ విరుచుకుప‌డ్డారు.

గ‌త‌మంతా త‌వ్వి…

ఫ్రంట్ లైన్ వారియర్స్ లేకపోతే కరోనా విపత్తును ప్రభుత్వం ఎదుర్కొనేదా అని టీడీపీ నేత విరుచుకుప‌డ్డారు. “కరోనా కిట్లు ఇవ్వకపోయినా, ఆరోగ్య బీమా కల్పించకపోయినా విధి నిర్వహణలో వైద్య సిబ్బంది ఎక్కడా రాజీపడకుండా పనిచేశారు. వారి కష్టానికి ఈ ప్రభుత్వం ఇచ్చే విలువ ఇదేనా? పాడేరు ఘటనలో నర్సులపై అభ్యంతరకరంగా ప్రవర్తించిన పోలీసులపైనా, కళ్ల ముందే దారుణం జరుగుతున్నా అడ్డుకోకుండా చోద్యం చూసిన మంత్రి అవంతి శ్రీనివాస్ పైనా ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలి. తక్షణమే మంత్రి పదవి నుంచి అవంతిని తొలగించాలి.` అని డిమాండ్ చేశారు.

author avatar
sridhar

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju