Roja : సినీనటి , నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అంటే టక్కున గుర్తుకు వచ్ఏది ఆమె ఫైర్ బ్రాండ్ వ్యక్తిత్వమే కాకుండా పాపులర్ టీవీ షో జబర్దస్త్ కూడా! రాజకీయాల కంటే జబర్దస్త్ పైనే రోజా ఎక్కువ దృష్టి పెడుతున్నారు అని విమర్శించే వారు లేకపోలేదు. అయితే , ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో ఊహించని షాక్ తగిలింది. పంచాయతీ ఎన్నికలు నగరి వైసీపీలో వర్గ పోరును బహిర్గతం చేశాయి.దీంతో అక్కడ పలుచోట్ల టీడీపీ గెలిచారు.
Roja నగరిలో ఏం జరిగింది ?
నగరి నియోజకవర్గంలో 94 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ 74 గెలిచింది. అయితే ఎన్నికలలో తన అభ్యర్ధులను గెలిపించుకోవడానికి రోడ్డెక్కి రోజా చెమటోడ్చారు. టీడీపీ ఇన్ ఛార్జ్ గాలి భాను ప్రకాష్ మాత్రం ప్రచారం చేయకుండానే 20వరకు సీట్లు గెలిపించుకోవడం సోంత పార్టీ కేడర్ మింగుడు పడని అంశంగా మారిందట. టీడీపీ గెలుపు లెక్కలు ఆరాతీస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల నామినేషన్లు అప్పుడే రెబల్స్ తీవ్ర స్ధాయిలో రోజాను ఇబ్బంది పెట్టారు. మున్సిపల్ ఎన్నికలలో అవకాశం ఇస్తానని చెప్పినా కొందరు నేతలు ఏమాత్రం వినకుండా రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగారు.. దీనివల్ల అక్కడ టిడిపి గెలిచే అవకాశం వచ్చిందని సమాచారం.
కన్నెర్ర చేసిన రోజా…
ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహించే నగరి నియోజకవర్గంలోపంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే వైఎస్సార్సీపీలో కీలక పరిణామాలు జరిగాయి. టీడీపీ గెలుపునకు కారణం వైసీపీ రెబల్స్ పోటీ అని అని భావించిన రోజా ఎన్నికల ఫలితాల వరకు వేచి చూసి తాజాగా వారిపై వేటు వేశారు. తడుకుకు చెందిన ముప్పాళ్ల రవి శేఖర్ రాజా, వై. బొజ్జయ్య పార్టీ నుంచి తొలగించింది. కేబీఆర్ పురానికి చెందిన తోటి ప్రతాప్, తొర్రురు పంచాయతీకి చెందిన యం.కిషోర్ కుమార్, గుండ్రాజు కుప్పం హరిజన వాడకు చెందిన రాజాపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ అభ్యర్థులను ఓడించాలని ప్రయత్నించినవారిని సస్పెండ్ చేసినట్లు ఎమ్మెల్యే రోజానే స్వయంగా తెలిపారు.
ఇక వైఎస్సార్సీపీ జెండా, గుర్తులును కూడా పట్టుకోవడానికి వీల్లేదన్నారు. పార్టీ తరపున పనిచేయడానికి వీల్లేదన్నారు. ఎమ్మెల్యే రోజాతో పాటూ స్థానిక పార్టీ నేతల ఫిర్యాదుతో వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు. సొంత పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిని రోజా సస్పెండ్ చేశారు. ఇంకోసారి ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే చర్యలు తప్పదని హెచ్చరించారు..అలాంటి వారిని ఎరివేస్తానని రోజా స్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు.