Lock Down: తెలంగాణ‌లో లాక్ డౌన్‌… ఈ విష‌యం మీకు తెలుసా?

Share

Lock Down: క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో లాక్ డౌన్‌ విధిస్తారా? అనే చ‌ర్చ ప్ర‌తి చోటా తెర‌మీద‌కు వ‌స్తోంది. ఈ స‌మ‌యంలో తెలుగు వారి దృష్టి హైద‌రాబాద్ పై ప‌డింది. లాక్ డౌన్ విధిస్తారా? అనే సందేహం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ కీల‌క క్లారిటీ ఇచ్చారు. జిల్లాల కలెక్టర్‌‌లతో జరిపిన టెలీ కాన్ఫరెన్స్‌‌లో ఆయ‌న రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులో ఉన్నాయని తెలిపారు. కరోనా కట్టడికి అధికారులు చేస్తున్న కృషి మరువలేనిదని జిల్లాల కలెక్టర్‌‌లను సీఎస్ సోమేశ్ కుమార్ ప్ర‌శంసించారు.

లాక్ డౌన్ పెడ‌తారా?

ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర కేసులు తక్కువగా ఉన్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్ల‌డించారు. లాక్‌‌డౌన్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. లాక్‌డౌన్ పనికిరాదని, దాని వల్ల పెద్దగా మార్పులు ఉండవన్నారు. ‘కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లాల్లో కొవిడ్ కంట్రోల్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నాం. 10 రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గుతోంది. మెడిసిన్‌లు, ఆక్సిజన్ కొరత లేదు. రాష్ట్రంలో 52 వేల బెడ్‌‌లు సిద్ధంగా ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను పెంచేందుకు యత్నిస్తున్నాం. హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాల వారికీ కరోనా ట్రీట్‌మెంట్ జరుగుతోంది. రోజుకు 33 ఎయిర్ అంబులెన్స్‌‌లు నగరానికి వస్తున్నాయి` అని వెల్ల‌డించారు.

కీల‌క సూచ‌న‌లు

సెకండ్ వేవ్‌‌లో వైరస్ వేగంగా వ్యాప్తి అవుతోంది కాబట్టి అవసరం లేకపోతే బయట తిరగొద్దు అని సీఎస్ సోమేశ్ కుమార్‌ సూచించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర కరోనా అదుపులో ఉందని సీఎస్ తెలిపారు. కరోనా కట్టడి కోసం ఎంతైనా ఖర్చు పెట్టమని సీఎం చెప్పారు. లిక్విడ్ ఆక్సిజన్, వెంటిలేటర్‌‌లు, బెడ్‌‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతంలో 12 వేల బెడ్లు ఉండేవని, ఇప్పుడు 52 వేల బెడ్‌‌‌లు ఉన్నాయని చెప్పారు. మాస్కులు, ppe కిట్ లు,ర్యాపిడ్ యాంటీ జెన్ కిట్‌‌లు కూడా ఉన్నాయని.. పాజిటివ్ వచ్చిన వాళ్లకు హెల్త్ కిట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. రెమిడిసివర్, టోసిలి జిమీబివర్ కూడా మనకు కావాల్సినవన్ని ఉన్నాయని, ప్రతి జిల్లాలో ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు కూడా చేస్తున్నామన్నారు. లక్షణాలు ఉన్న వారికి వెంటనే ట్రీట్‌‌మెంట్ అందించాలి. లక్షణాలను త్వరగా గుర్తించి, సరైన సమయానికి మెడిసిన్స్ వేసుకుంటే కరోనా నుంచి సులువుగా బయటపడొచ్చు’ అని సీఎస్ చెప్పారు.


Share

Related posts

బాల‌య్య‌కు షాకుల మీద షాకులు ఇస్తున్న వైసీపీ

sridhar

Ram Charan: రామ్ చరణ్ తో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన బాలీవుడ్ టాప్ బ్యూటీ ..??

sekhar

భీమా కోరేగావ్ కేసును కబ్జా చేసిన కేంద్రం!

Siva Prasad