Lock Down: ఏపిలో కర్ఫ్యూ పొడిగింపా..! లాక్ డౌన్‌ అమలా ? తేలేది నేడే.. !!

Share

Lock Down: ఏపిలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. ఓ పక్క లాక్ డౌన్ అమలు అవుతున్నా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టలేదు. రోజు 20వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. మృతుల సంఖ్య వంద మార్కు దాటింది.  రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ అమలు చేయాలన్న డిమాండ్ వస్తూనే ఉంది. ఇప్పటికే రోజు పది పదిహేను వేల కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ ఆంక్షలను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. తొలుత లాక్ డౌన్ అమలును వ్యతిరేకించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సైతం కరోనా కట్టడికి ఆ దిశగా చర్యలు తీసుకోక తప్పలేదు. లాక్ డౌన్ అమలు సత్ఫలితాలు ఇస్తోందని ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

Lock Down andhra pradesh ?
Lock Down andhra pradesh ?

ఏపిలో రేపటితో కర్ఫ్యూ ముగియనున్నది. కర్ఫ్యూ అమలు జరుగుతున్నా పాజిటివిటీ రేటు తగ్గలేదు. అయితే ఇప్పటి వరకూ ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకూ కర్ఫ్యూ నుండి సడలింపును ప్రభుత్వం ఇచ్చింది. ఈ సడలింపును మరింత కుదించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నేడు కోవిడ్ పై జరిగే కేబినెట్ సబ్ కమిటీ భేటీలో దీనిపై ప్రధానంగా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. మరో రెండు మూడు గంటల పాటు కర్ఫ్యూను పెంచి పటిష్టంగా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. అదే విధంగా ఎల్లుండి నుండి కర్ఫ్యూను మరింత పకడ్బందీగా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత పరిస్థితులను సమీక్షించి కేసులు తగ్గుముఖం పట్టకపోతే లాక్ డౌన్ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

 

 


Share

Related posts

Mamata Banerjee: ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని భావిస్తున్న సీఎం!భవానీ పూర్ నుండి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి మమతా బెనర్జీ !!

Yandamuri

బిగ్ బాస్ 4: అతను టైటిల్ గెలవాలని ఆశిస్తున్నా అంటున్న హీరోయిన్ దీక్షాపంత్..!!

sekhar

చంద్రబాబు జైలుకెళ్లే రోజులు దగ్గరపడ్డాయి అంటున్న ఆ పార్టీ అధినేత..!!

sekhar