Repalle (Bapatla): బాపట్ల జిల్లా రేపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నాపరాయి లోడ్ తో వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన కాలువలో బొల్తా కొట్టింది. మాచర్ల నుండి రేపల్లెకు వెళుతుండగా రావిఅనంతవరం శివారులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతులు పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన వారిగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.