NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Lover Suicide Attempt: భగ్న ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం..! సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో..! ఆ తరువాత ఏమైందంటే..?

Lover Suicide Attempt: ఇటీవల కాలంలో తెలిసీ తెలియని వయసులో యువతీ యువకులు ప్రేమించుకోవడం, పెద్దలు పెళ్లికి ఒప్పుకోవడం లేదనో లేక ప్రేమించిన యువతి, లేక యువకుడు మోసం చేశాడనో ఆత్మహత్యలు చేసుకోవడం అక్కడక్కడా జరుగుతున్నాయి. అయితే ఎక్కువ మంది తమ భావాలను, ఆవేదనలను వాట్సాప్, ఫేస్ బుక్ ల ద్వారా స్నేహితులకు షేర్ చేసుకుంటుంటారు. ఒక్కో సారి ఇది కూడా వారి ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతున్నాయి.

Lover Suicide Attempt in ongole
Lover Suicide Attempt in ongole

విషయంలోకి వెళితే..ప్రకాశం జిల్లా మారెళ్ల గ్రామానికి చెందిన నాగభూషణం అనే యువకుడు ఒంగోలు నగరంలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కొద్ది కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే వారి మధ్య ఎందుకు బేధాభిప్రాయాలు వచ్చాయో గానీ లవ్ బ్రేకప్ అయ్యింది. గత కొద్ది రోజులుగా ప్రేమ విఫలమైన నాగభూషణం మరో దేవదాసుగా మారడంతో విషయం తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన వాళ్లు తమ కుమారుడు ఏమైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో అన్న భయంతో ఓ ఇద్దరు యువకులను పురమాయించి తమ కుమారుడిపై ఒక కన్నేసి ఉంచాలని సూచించారు. అయితే వీళ్ల కళ్లుకప్పి నాగభూషణం తన రూమ్ నుండి పారిపోయి నగర శివారుకు చేరుకున్నాడు. కాసేపటిలో తాను చనిపోతున్నాననీ, అందుకు లవ్ ఫేయిల్యూరే కారణం అంటూ పేస్ బుక్ లో వీడియో పోస్టు చేశాడు నాగభూషణం.

Read More: AP EAP CET: ఏపిలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..

అయితే నాగభూషణం ఫేస్ బుక్ లో షేర్ చేసిన వీడియోను చూసిన నెల్లూరులోని స్నేహితుడు వెంటనే ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీనిపై వెంటనే స్పందించిన సీఐ శ్రీనివాసరెడ్డి అతని సెల్ ఫోన్ ను ట్రాక్ చేసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే సీఐ సిబ్బందితో అక్కడకు వెళ్లే సమయానికే పురుగు మందు తాగి నాగభూషణం పడి పోయి ఉన్నాడు. వెంటనే పోలీసులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అతను కోలుకుంటున్నాడు. తమ కుమారుడిని ప్రాణాపాయం నుండి కాపాడిన పోలీసులకు బాధితుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju