MAA Elections: చిరంజీవి పరువు – పెద్దరికానికి పరీక్ష ..! 900 ఓట్ల కోసం నడి బజారులులో సిని’మా”..! మా ఎన్నికల్లో ఇదో పెద్ద ట్విస్ట్..!!

Share

MAA Elections: అక్కడ ఉన్నది కేవలం 900 ఓట్లు మాత్రమే.. కానీ ఒక నియోజకవర్గానికి మించి, ఒక జిల్లాకు మించి, రాష్ట్ర స్థాయిలో రాజకీయ ఆసక్తి మొత్తం సిని(మా) ఎన్నికలపై పడింది. దానికి కారణం అంతర్గతంగా కులాలు, రాజకీయ నాయకులు, పార్టీల పెద్దలు సినీ పరిశ్రమలో తలదూర్చడమే. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రెండు రాజకీయ పార్టీల మధ్య వైరంగా మారియి. గతంలో ఎప్పుడూ కూడా ఇలా లేదు. గతంలో మా ఎన్నికలు ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగిన దాఖలాలు లేవు. రెండేళ్ల క్రితం అంటే 2019లో జరిగిన మా ఎన్నికలు కాస్త సీరియస్ గానే జరిగాయి. నరేష్, జీవితా రాజశేఖర్, నాగబాబు తదితరులు పోటీలో ఉన్న నేపథ్యంలో దారుణంగా విమర్శలు, వ్యాఖ్యలు చేసుకున్నప్పటికీ ఇంత ప్రతిష్టాత్మకం కాలేదు. ఇప్పుడు ఆ ఎన్నికలకు మించి చాలా రసవత్తరంగా మారాయి. ఒకరికి ఒకరు బజారుకు ఈడ్డుకుని, పరస్పరం వ్యక్తిగత దూషణలతో మా ఎన్నికలను వేడెక్కిస్తున్నారు.

MAA Elections:  చిరంజీవి పెద్దరికాన్ని అంగీకరించని మోహన్ బాబు

సరే..దీనికి చిరంజీవి పెద్దరికానికి ఏమైనా లింక్ ఉందా అనేది కశ్చితంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరు. దాదాపు మూడు దశాబ్దాల పాటు దాసరి నారాయణరావు గారు తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవాళ్లు. ఎందుకంటే ఆయన రెండు తరాల హీరోలకు దర్శకత్వం వహించి వాళ్లకు మంచి హిట్లు ఇచ్చారు. కాపు సామాజిక వర్గం తరపున డైరెక్టర్ గా ఎదిగి అన్ని సామాజిక వర్గాలను కలుపుకున్నారు. ఆయన ఎన్టీఆర్, ఎఎన్ఆర్, కృష్ణ, సోభన్ బాబు, మోహన్ బాబు, చిరంజీవి లాంటి అగ్ర నటులతో సినిమాలు తీశారు. దీంతో ఆయన పెద్దరికం అలా నిలబడింది.  దాదాపు 25 సంవత్సరాల పాటు తెలుగు చిత్ర సీమకు పెద్ద తరహాగా ఉన్నారు. దాసరి నారాయణరావు తరువాత సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు అంటూ లేదు. ఇప్పుడు కృష్ణ, కృష్ణంరాజుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ వారి వయసు అయిపోయింది. చిరంజీవి పేరు వినబడుతోంది. అయితే ఆయనను పెద్ద దిక్కుగా అంగీకరించేందుకు మోహన్ బాబు లాంటి వాళ్లు సిద్ధంగా లేరు. మోహన్ బాబు, రాజశేఖర్, బాలకృష్ణ లాంటి వాళ్లు సమకాలికులు కావడంతో ఈగో క్లాష్ మూలంగా చిరంజీవి పెద్దరికాన్ని అంగీకరించే పరిస్థితిలో లేరు. సినీ చరిష్మా చూసుకున్నా, ఫ్యాన్స్ బేస్ లో చూసుకున్నా చిరంజీవికి పెద్దరికం అప్పగించవచ్చు. కానీ చిరంజీవి వ్యక్తిత్వం వల్ల గతంలో రాజకీయంగా దెబ్బతిన్న కారణంగా ఆయన సినీ పరిశ్రమకు కొంత కాలం దూరమై రాజకీయాలు నడిపిన కారణంగా ఆయన పెద్దిరికాన్ని మిగిలినవాళ్లు అంగీకరించే పరిస్థితి లేదు. సో..అందుకే మా ఎన్నికలు ఇప్పుడు అంత ప్రతిష్టాత్మకం అయ్యాయి.

సిని’మా’లో కమ్మ సామాజిక వర్గ పెత్తనం

ఒక వైపు కాపు సామాజిక వర్గం అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, మరో వైపు కాపు సామాజిక వర్గానికి వీళ్లే బ్రాండ్. మొదటి సినీ ఇండ్రస్టీలో కమ్మ సామాజిక వర్గందే పెత్తనంగా ఉండేది. ఎన్టీఆర్ గానీ, ఎఎన్ఆర్ గానీ, కృష్ణ వీళ్లందరిదీ. ఆ తరువాత దాసరి నారాయణరావు గారు అల్లు రామలింగయ్య ద్వారా చిరంజీవి ఎంటర్ కావడంతో కాపు సామాజిక వర్గానికి పెత్తనం వచ్చేలా చేశారు. దీంతో రెండు సామాజిక వర్గాలు సినీ ఇండస్ట్రీలో భాగంగా ఉన్నాయి. సామాజిక వర్గాల విషయాన్ని పక్కన బెట్టి పార్టీల విషయం గురించి మాట్లాడుకుంటే.. ఇటువైపు ప్రకాశ్ రాజ్ కు పవన్ కళ్యాణ్ సపోర్టు ఇచ్చారు. రిపబ్లిక్ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ లోకల్, నాన్ లోకల్ అనే ఫీలింగ్ లు చూడవద్దు, కేవలం వ్యక్తులను మాత్రమే చూసి ఓట్లు వేయండి అనే విధంగా చెప్పారు. అదే సందర్భంలో మోహన్ బాబును విమర్శించారు. మీరు మద్దతు ఇచ్చిన పార్టీ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను ఇబ్బంది పెడుతోంది, మీరు బయటకు వచ్చి మాట్లాడండి అంటూ సూచించారు. ఇటువైపు మోహన్ బాబు ఆయనకు కౌంటర్ ఇచ్చి ముందు మీరు ఆబ్బాయికి ఓట్లు వేయండి ఆ తరువాత మనం మాట్లాడదాం అన్నారు.  సో..ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రకాశ్ రాజ్ గారికి చిరంజీవి వర్గం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇటువైపు వర్గం మొత్తం ఉన్నట్లే.

MAA Elections: సిని’మా’లో రాజకీయాలు

మరో పక్క మోహన్ బాబు కుమారుడు విష్ణుకు ప్రత్యక్షంగా అయితే లేదు కానీ పరోక్షంగా వైసీపీ సపోర్టు ఉంది. ఆ టాక్ వచ్చిన నేపథ్యంలో ఇటీవల మంత్రి పేర్ని నాని దీనిపై కౌంటర్ ఇచ్చారు.  మా ఎన్నికలకు తమ పార్టీకి, ప్రభుత్వానికి, సీఎం జగన్ కు  సంబంధం లేదు, వాళ్లు వాళ్లు చేసుకుంటున్నారు అని వివరణ ఇచ్చారు.  కానీ విష్ణు ఏమిచెప్పారంటే జగన్మోహనరెడ్డి నాకు స్వయనా బావ, వైసీపీ మద్దతు నాకు ఉంది అని చెప్పారు. కాగా విష్ణు తండ్రి మోహన్ బాబు వైసీపీ కుండువా కప్పుకొని గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. సో..ఇక్కడ వైసీపీ వర్సెస్ జనసేన అని చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ ఎలాగో రాజకీయంగా ఫెయిల్ అయిన చిరంజీవికి మా ఎన్నికల్లో అయినా సరే తన ప్రాభవం, తన తమ్ముడి ప్రాభవం దక్కాలి అంటే తన పెద్దరికం, పరువు నిలబడాలంటే తాము పరోక్షంగా మద్దతు ఇచ్చిన ప్రకాశ్ రాజ్ గెలవాలి. గెలవకపోతే ఆయన పెద్దరికానికి, ఆయన పరువుకు, ఆయన చరిష్మాకు, ఆయన సీనియారిటీకి విలువ లేనట్టే. అందుకే ఆయన పరువుతో ఈ పరీక్ష జరుగుతున్నట్లు చెప్పుకోవచ్చు.


Share

Related posts

షాకింగ్! #మీటూ వలలో రాజ్ కుమార్ కుమార్ హిరానీ?

Siva Prasad

Sonu Sood: సోనుసూద్ వెనక కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్..! నిజమెంత?

Muraliak

పూజా హెగ్డే – రష్మిక మందన్న తో లేడీ మల్టీస్టారర్ నిర్మించబోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ..?

GRK