MAA Elections: మా ఎన్నికలపై షాకింగ్ కామెంట్స్..! నిన్న నాగబాబు..నేడు ప్రకాశ్ రాజ్..! రేపు ఎవరో..?

Share

MAA Elections:  ప్రతిష్టాత్మకంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడుగా మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ 106 ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యారు. మా ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా హోరాహోరీ పోటీ జరిగింది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య మాటల యుద్ధం తారా స్థాయిలో నడిచింది. ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్, తెలుగు వాడు కాదు అంటూ విస్తృతంగా ప్రచారం చేసి మంచు వర్గం సక్సెస్ అయ్యింది. పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగింది. దీంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠతన నెలకొంది. ఈసీ సభ్యులు ఎక్కువ మంది ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన వారు గెలిచినప్పటికీ కీలకమైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు, వైస్ ప్రెసిడెంట్ పదవులు మంచు విష్ణు ప్యానెల్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మద్దతుగా తొలి నుండి వాయిస్ వినిపించిన నాగబాబు తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. మా సభ్యత్వానికి నిన్ననే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్థత్వంతో కొట్టుమిట్టాడుతున్న మువీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో కొనసాగడం ఇష్టం లేక మా అసోసియేషన్ లో తన ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తాజాగా ప్రకాశ్ రాజ్ కూడా అదే నిర్ణయాన్ని తీసుకున్నారు.

MAA Elections: Prakash raj quits maa association
MAA Elections: Prakash raj quits maa association

Read More: MAA Elections: ‘మా’ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కీలక నిర్ణయం ప్రకటించిన నాగబాబు..! అది ఏమిటంటే…?

MAA Elections:  ప్రకాశ్ రాజ్ రాజీనామా

తాజాగా ప్రకాశ్ రాజ్ మా ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఓటమిపై భావోద్వేగానికి గురయిన ప్రకాశ్ రాజ్ ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు.  మా అధ్యక్షుడుగా ఎన్నికైన మంచు విష్ణు..అతని ప్యానల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రకాశ్ రాజ్ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయత అధారంగా ఎన్నికలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేసిన ప్రకాశ్ రాజ్.. “నేను తెలుగు వాడిని కాదు. నా తల్లిదండ్రులు తెలుగు వారు కాదు. అది నా తప్పుకాదు. తెలుగువాడిని కాకపోవడం నా దురదృష్టం. అందుకే నేను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను” అని తెలిపారు. ఓటమిని జీర్ణించుకున్నా తరువాతే రాజీనామా చేస్తున్నానన్నారు.

తెలుగు బిడ్డను ఎన్నుకున్నారు

“మా తో నాకు 21 ఏళ్ల అనుబంధం ఉంది. రఘుబాబు, కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలను గౌరవిస్తానన్నారు. నన్ను అతిధిగా మాత్రమే ఉండమన్నారు. నేను అతిధిగానే ఉంటాను. నాకు ఆత్మాభిమానం ఉంది. తెలుగు సినిమాల్లో నటిస్తాను, నేను యూనివర్సల్ గా ఉంటాను. ఇలాంటి ప్రాంతీయ వాదం ఉన్న అసోసియేషన్ లో నేను ఉండలేను, మా ప్రాధమిక సభత్వానికి రాజీనామా చేయడం బాధతో తీసుకున్న నిర్ణయం కాదు” అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. మా ఎన్నికలు సజావుగా జరిగాయని అన్నారు. చైతన్యంతో ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొన్నారనీ, తెలుగు బిడ్డను మా అధ్యక్షుడుగా ఎన్నుకున్నారని ప్రకాశ్ రాజ్ అన్నారు. నిన్న నాగబాబు, నేడు ప్రకాష్ రాజ్ ఇలా కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఇంకా మరి కొందరు సభ్యులు కూడా మా నుండి దూరం అవుతారనే మాట సినీ వర్గాల నుండి వినబడుతోంది.

Read More: MAA Elections: ఈ విషయంలో కేసిఆర్ సర్కార్ యమ గ్రేటో..! వాళ్లు థ్యాంక్స్ చెప్పాల్సిందే..!!?

 


Share

Related posts

ఎన్డీయే సీట్ల సర్దుబాటు ఇదీ!

Siva Prasad

Sai daram tej: రికవర్ అయ్యి ఇంటికి వచ్చాక పెళ్లి కండీషన్ పెట్టిన సాయిధరమ్‌తేజ్‌ ఫ్యామిలీ..

Ram

చంద్రబాబు నెత్తిన పాలుపోసిన కేంద్ర ప్రభుత్వం !

sekhar