NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ సినిమా

MAA Elections: ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..! నరేశ్, విష్ణు వ్యాఖ్యలకు కౌంటర్ కామెంట్స్ ఇవీ..!!

MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇరు పక్షాల ప్యానల్ నుండి మాటల తూటాలు పేలుతున్నాయి. మా ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, యువనటుడు మంచు విష్ణు ప్యానల్ తలపడుతున్న సంగతి తెలిసిందే. జనరల్ సెక్రటరీ పదవికి నామినేషన్ దాఖలు చేసిన నిర్మాత బండ్ల గణేష్ నామినేషన్ ను ఉపసంహరించుకుని ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు పలికారు. కాగా ఇటీవల నరేశ్, విష్ణు చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో చిరంజీవి, కృష్ణ వంటి పెద్ద వారిని ఎందుకు లాగుతున్నారంటూ ప్రత్యర్థి ప్యానెల్ పై మండిపడ్డారు.

MAA Elections: prakash raj serious comments on naresh and vishnu
MAA Elections prakash raj serious comments on naresh and vishnu

 

MAA Elections: నరేశ్ మాట్లాడేవన్నీ అబద్దాలు

నరేశ్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ తాను చెప్పని మాటలను చెప్పానని నరేశ్ అబద్దాలు మాట్లాడుతున్నారనీ, ఆయన మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని అన్నారు. మీరు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా అని మంచు విష్ణు ప్రశ్నించడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పుబట్టారు. పవన్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. “పవన్ ప్రసంగాన్ని విశ్లేషించాలి, మొదట ఆయన సినీ నటుడు, ఆ తర్వాతే రాజకీయ నాయకుడు, విష్ణు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ సినిమా మార్నింగ్ షో కలెక్షనంత లేదు మీ సినిమా బడ్జెట్ మొత్తం. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మీకు పొలిటికల్ అజెండా ఉంటే మీరు చూసుకోండి. పవన్ సినీ నటుడు, ఆయన రాజకీయ అజెండా మాకు వద్దు. ఏపి రాజకీయాలు నాకు తెలియదు.

మా ఎన్నికల్లో సీఎంలను లాగొద్దు

ఇండస్ట్రీ పరంగా పవన్ రెండు మూడు ప్రశ్నలు అడిగారు, అవి ఏ స్వరంతో అడిగారన్న దానిపై మనం చర్చించుకుందాం. మీరు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారా? ఇండస్ట్రీ పక్కన ఉన్నారా? అంటూ నన్నెందుకు లాగుతున్నారు, ఆయనకు నాకు సిద్ధాంత పరంగా విబేధాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పవన్ స్వయంగా చెప్పారు. అయితే సిినిమా విషయానికి వస్తే నేను నంద.. ఆయన బద్రి.. అయిపోయిందంతే. మా ఎన్నికల్లో జగన్ ను లాగొద్దు. ఆయన పాదయాత్ర చేసి ప్రజల మనసు గెలుచుకుని సీఎం అయ్యారు. మా అసోసియేషన్ గురించి ఆలోచించేంత సమయం ఆయనకు ఉండదు. కేసిఆర్ ఉద్యమం చేసి సీఎం అయ్యారు, ఆయనకు చాలా పనులున్నాయి. ఇందులో వాళ్ల పేర్లు ఎందుకు లాగుతున్నారు” అంటూ ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju