NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ సినిమా

MAA Polls: ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు మనోగతం ఇది..!!

MAA Polls: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రముఖ సినీనటుడు, మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు వెల్లడించారు. ఈ మేరకు నేడు ట్విట్టర్ వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. మా అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేయనున్నానని ప్రకటించిన మంచు విష్ణు..పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, సమస్యలు తనకు బాగా తెలుసునని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు తాను ఎప్పటికీ రుణ పడి ఉంటానని అన్నారు.

MAA Polls: manchu vishnu letter
MAA Polls manchu vishnu letter

“ఈ ఏడాది జరగనున్న మా అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నాను. సినిమా పరిశ్రమనే నమ్ముకున్న కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు మా కుటుంబ సభ్యుల భావాలు, బాధలు తెలుసు. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినీ పరిశ్రమకు ఎప్పటికీ రుణ పడి ఉంటాను, ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను” అని మంచు విష్ణు పేర్కొన్నారు.

Read more: AP CS Adityanath Das: మూడు నెలల ఎక్స్‌టెన్షన్ వచ్చిన వెంటనే ఏపి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఏమి చేశారంటే..!?

“మా భవనం నిర్మాణానికి అవసరమయ్యే ఖర్చులో తమ కుటుంబం 25 శాతం భరిస్తుందని విష్ణు తెలిపారు. నా తండ్రి మోహన్ బాబు మా అసోసియేషన్ కు అధ్యక్షుడుగా చేసిన సేవలు, వారి అనుభవాలు, నాయకత్వ లక్షణాలు ఇప్పుడు నాకు మార్గదర్శకాలు అయ్యాయి. గతంలో మా అసోసియేషన్ కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేసినప్పుడు మా బిల్డింగ్ ఫండ్ కు నా కుటుంబం తరపున నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం అందిస్తామని మాట ఇచ్చాను. భవన నిర్మాణ నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా నేను కొన్ని సలహాలు, సూచనలు చేశాను. అవి మా కుటుంబ సభ్యుల సహకారంతో దిగ్విజయంగా అమలు చేశాను. మా వ్యావహారాలు అన్ని అతి దగ్గరగా పరిశీలించిన నాకు మా కటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన, అనుభవం ఉంది. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం. కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటాం. అందుబాటులో ఉంటాం, మా అసోసియేషన్ అధ్యక్షుడుగా నా సేవలు సంపూర్ణంగా అందించాలనుకుంటున్నాను. పెద్దల అనుభవాలు, యువరక్తంతో నిండిన కొత్త  ఆలోచనలు కలగలిపి నడవాలన్నదే నా ప్రయత్నం. మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని ఆశిస్తున్నా” అంటూ లేఖ రాశారు మంచు విష్ణు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu