MAA: ‘మా’లో పెద్ద కుదుపు..! ప్రకాశ్ రాజ్ ప్యానెల్ విజేతలు 11 మంది రాజీనామా..!!

Share

MAA: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. మా ఎన్నికలో ఓటమి పాలైన ప్రకాశ్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మా అధ్యక్షుడుగా విజయం సాధించిన తర్వాత మంచు విష్ణు మాట్లాడిన కొన్ని మాటలు బాధ కలిగించాయనీ, ఇప్పుడు అనేక పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమ ప్యానెల్ నుండి గెలుపొందిన సభ్యులు మా కార్యవర్గం నుంచి తప్పుకుంటున్నారని వెల్లడించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలుపొందిన 11 మంది సభ్యులు రాజీనామా చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్, ప్యానెల్ లో గెలిచిన వారు  కీలక వ్యాఖ్యలు చేశారు. జరిగిన సంఘటనలపై పూర్తి స్థాయిలో చర్చించామన్నారు. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని, ఎన్నికల్లో రౌడీయిజం చేశారని సంచలన ఆరోపణ చేశారు.

MAA: prakash raj panel sensational decision
MAA: prakash raj panel sensational decision

Read More: MAA: ‘మా’పై నాగబాబు హాట్ కామెంట్స్..! సినీ వర్గాల్లో చర్చ..!!

MAA: విష్ణు బైలాస్ మారిస్తే రాజీనామాకు ఉపసంహరణ

పోస్టల్ బ్యాలెట్ లో అన్యాయం జరిగిందన్నారు. గెలిచిన వారిని ఓడిపోయారని ప్రకటించారన్నారు. రాత్రికి రాత్రికి ఫలితాలు మార్చేశారన్నారు. రెండేళ్ల పాటు విష్ణు బాగా పని చేయాలి, విష్ణుకు అడ్డురాకూడదని రాజీనామా చేస్తున్నామన్నారు. తెలుగు వాడు కాని వాడు కూడా పోటీ చేయడానికి వీలు ఉందని మంచు విష్ణు హామీ ఇస్తూ బైలాస్ మార్చామని చెబితే రాజీనామా ఉపసంహరించుకుంటానని ప్రకాశ్ రాజ్ అన్నారు. పని చేయకపోతే విష్ణును ప్రశ్నిస్తామన్నారు. వారితో కలిసి ప్రయాణం చేయలేమని తప్పుకోవడం జరిగిందన్నారు. విష్ణు బాగా పని చేస్తారని అశిస్తున్నామని, పని చేయకపోతే బయట ఉన్న ప్రశ్నిస్తామన్నారు.  ఇదే సందర్బంగా పలువురు సభ్యులు తమ పడ్డ ఇబ్బందులను వివరించారు. ఎన్నికల రోజు మోహన్ బాబు తనను కొట్టడానికి కూడా వచ్చారని, అరగంట సేపు తిట్టారనీ ఆరోపించారు.

ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ లేదు

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మీడియా సమావేశం పెడుతున్నారని తెలియడంతో ‘ఆత్మ’ పేరుతో ‘మా’కు పోటీగా కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేయబోతున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దీనిపై ప్రకాశ్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ అంటూ ఏ అసోసియేషన్ లు ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు  అటువంటి ఆలోచన కూడా లేదని తెలిపారు. అందరూ తమ పదవులకే రాజీనామా చేశారనీ, మా సభ్యులుగా కొనసాగుతారని చెప్పారు.

 


Share

Related posts

కరోనా వైరస్ పై వైఎస్ జగన్ వ్యాక్యలు

Siva Prasad

ఛాన్స్ దొరికిందని రెచ్చిపోయిన కేటీఆర్..! ఎంఐఎం కి కొట్టాడు సరైన దెబ్బ

siddhu

పరువు నష్టం కేసులో రాహుల్‌కు సమన్లు

sarath