madanapalle double murder case: మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ మంజూరు

Share

madanapalle double murder case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ లభించింది. ఈ ఏడాది జనవరి 24న మూడ భక్తితో మదనపల్లెలో తమ ఇంట్లో పురుషోత్తం, పద్మజ దంపతులు తమ ఇద్దరి కుమార్తెలను అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

madanapalle double murder case accused bail granted
madanapalle double murder case accused bail granted

తొలుత ఈ కేసులో అరెస్టు అయిన పురుషోత్తం, పద్మజ దంపతుల మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తిరుపతి రూయా ఆసుపత్రికి, ఆ తరువాత విశాఖ మానసిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అనంతరం ఇటీవలే వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. కేసు నమోదు అయి 90 రోజులు పూర్తి కావడంతో నిందితులకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.


Share

Related posts

Kaushik Reddy: కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా..! రేవంత్ పై తీవ్ర స్థాయి ఆరోపణలు..!!

somaraju sharma

India – Singapore : సింగపూర్ షికార్ కొట్టండిలా..!!

bharani jella

Nimmagadda ramesh : సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న నిమ్మ‌గ‌డ్డ … ఇక జ‌గ‌న్ గేమ్ మార‌నుందా?

sridhar