Breaking: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో సారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లారస్ ల్యాబ్ యూనిట్ 3 లో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంతో కార్మికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ప్రమాదంలో నలుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరో కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో కార్మికులు ఆందోళనకు గురైయ్యారు.

సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫార్మా సిటీలో ఇంతకు పలు మార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ప్రమాదం ఎలా జరిగింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.