NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

cheating: రూ.30 కోట్లకు రియల్ వ్యాపారి టోకరా..! లబోదిబోమంటున్న బాధితులు..! ఇంతలోనే మరో ట్విస్ట్..!!

cheating: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు చిట్టీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలువురు వందలాది మందిని టోకరా ఇచ్చి ఉడాయిస్తున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి చివరకు బాకీ దారులకు హ్యాండ్ ఇస్తున్నారు. వారు సేఫ్ జోన్ లో ఉండేందుకు ఆస్తులను బంధువుల పేరుతో రాసి కోర్టులో ఐపీ పిటిషన్ లు ఫైల్ చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. కోర్టులో ఐపీ పిటిషన్ ఫైల్ చేస్తే డబ్బులు ఇచ్చిన వారు అతన్ని ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటోంది. ఇదే తరహా పెద్ద మోసం ఒకటి గుంటూరు జిల్లా నరసరావుపేటలో వెలుగులోకి వచ్చింది.

man Cheating peoples with chits scheme and escape in Guntur dist
man Cheating peoples with chits scheme and escape in Guntur dist

Read More: AP YSRCP: ఏపీలో మరో సారి జగన్‌దే అధికారం..! ఇదీ లెక్క..!!

విషయం ఏమిటంటే…నరసరావుపేట అరండల్ పేటలోని ఓ ఆపార్ట్ మెంట్ లో నివాసం ఉండే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద ఎత్తున ప్రైవేటు చిట్టీ పాటలను నిర్వహించడంతో పాటు ఆపార్ట్ మెంట్ల నిర్మాణం చేస్తూ బిల్డర్ గా పేరు తెచ్చుకున్నారు. చిట్టీలు వేసిన సభ్యులను బ్యాంకాక్, సింగపూర్ తదితర ప్రాంతాలకు తీసుకువెళ్లేవాడు. ఈ వ్యాపార క్రమంలో అధిక వడ్డీ ఆశ చూపడంతో పలువురు బంగారు దుకాణాల యజమానులు, మందుల షాపు యజమానులు ఆయనకు పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూదేలు కావడంతో అప్పులు ఇచ్చిన వారికి వడ్డీలు కూడా ఇవ్వలేక, చిటీ పాడుకున్న వారికి డబ్బులు చెల్లించే పరిస్థితి లేక సదరు వ్యాపారి మోహం చాటేశాడు. దాదాపు రూ.30 కోట్ల వరకూ ఈ వ్యాపారి చెల్లించాల్సి ఉందని చెప్పుకుంటున్నారు.

కొద్ది రోజులుగా సదరు వ్యాపారి కార్యాలయానికి తాళం వేసి  ఉండటంతో అప్పులు ఇచ్చిన వారు, చిటీ పాట సభ్యులు ఆందోళనకు గురైయ్యారు. అతని గురించి బాధితులు కుటుంబ సభ్యులను ప్రశ్నించగా తమకు ఏమి తెలియదని సమాధానం ఇచ్చారు. అతను ఐపీ పెడతాడని కూడా రెండు రోజులుగా ప్రచారం జరుగుతుండటంతో ఆందోళన చెందిన అప్పులు ఇచ్చిన బాధితులు డీఎస్పీని ఆశ్రయించారు. అతనిపై ఫిర్యాదు అందజేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..బాకీ దారులకు మోహం చాటేసి పరారైన వ్యాపారి భార్య తన భర్త కనిపిండం లేదనీ, కొందరి వల్ల తన భర్తకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కొసమెరుపు. అయితే ఇటు వ్యాపారి భార్య, అటు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju